Aha CEO Changed : ఆహా సీఈఓను ఎందుకు మార్చారు… వివాదాలేనా? అసలు కథ ఏంటి?

Aha CEO Changed : 2020లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆహా పేరుతో తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ప్రారంభించారు. భవిష్యత్ ఓటీటీదే అని నమ్మిన అల్లు అరవింద్, ఎంటర్టైన్మెంట్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలో అడుగు పెట్టారు. అప్పటికే అమెజాన్, నెట్ఫ్లిక్స్, హాట్ స్టార్ వంటి అంతర్జాతీయ యాప్స్ తో పాటు ఇండియాకు చెందిన ఓటీటీ యాప్స్ అగ్రగామిగా కొనసాగుతున్నాయి. తీవ్ర పోటీ నెలకొన్న ఈ రంగంలో రాణించడం అంత ఈజీ […]

  • Written By: SRK
  • Published On:
Aha CEO Changed : ఆహా సీఈఓను ఎందుకు మార్చారు… వివాదాలేనా? అసలు కథ ఏంటి?


Aha CEO Changed :
2020లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆహా పేరుతో తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ప్రారంభించారు. భవిష్యత్ ఓటీటీదే అని నమ్మిన అల్లు అరవింద్, ఎంటర్టైన్మెంట్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలో అడుగు పెట్టారు. అప్పటికే అమెజాన్, నెట్ఫ్లిక్స్, హాట్ స్టార్ వంటి అంతర్జాతీయ యాప్స్ తో పాటు ఇండియాకు చెందిన ఓటీటీ యాప్స్ అగ్రగామిగా కొనసాగుతున్నాయి. తీవ్ర పోటీ నెలకొన్న ఈ రంగంలో రాణించడం అంత ఈజీ కాదు.

మొదట తెలుగు మార్కెట్ పై పట్టుసాధించాలని కేవలం తెలుగు కంటెంట్ తో ఆహా స్టార్ట్ చేశారు. ఆహా స్థాపించి మూడేళ్లు దాటిపోగా చెప్పుకోదగ్గ స్థాయికి చేరింది. సినిమాలు, వెబ్ సిరీస్లు, రియాలిటీ షోలు, సీరియల్స్, టాక్ షోల సమాహారంగా ఆహా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. కాగా ఆహా సీఈఓ ని సడన్ గా మార్చారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

aha New CEO Ravikanth

aha New CEO Ravikanth

ఆహా సీఈఓ గా అజయ్ ఠాకూర్ మొదటి నుండి సేవలు అందిస్తున్నారు. ఆయన స్థానంలోకి రవికాంత్ సబ్నవీస్ ని తీసుకొచ్చారు. ఈ క్రమంలో కొత్త అనుమానాలు తెరపైకి వచ్చాయి. మేనేజ్మెంట్ తో ఆయనకు ఏమైనా అభిప్రాయ బేధాలు తలెత్తాయా? అనే సందేహాలు కలుగుతున్నాయి. అయితే అజయ్ ఠాగూర్ బోర్డు డైరెక్టర్ గా పదోన్నతి పొందారని అందుకే ఆయన స్థానంలోకి రవికాంత్ వచ్చారంటున్నారు.

రవికాంత్ కి సీఈఓ గా అపార అనుభవం ఉంది. ఆయన గతంలో స్టార్ టీవీ, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ వంటి పెద్ద పెద్ద సంస్థల్లో పని చేశారు. ఆయన సారథ్యంలో ఆహా మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకుంటుందని యాజమాన్యం నమ్ముతుంది. అర్హ మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఆహాకు అల్లు అరవింద్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.

ఆహా ఎప్పటి కప్పుడు హిట్ చిత్రాలను, ఫ్రెష్ కంటెంట్ ఆడియన్స్ కి అందిస్తుంది. ఇక ఆహాలో స్ట్రీమ్ అయిన అన్ స్టాపబుల్ షో ఒక సెన్సేషన్. బాలయ్య హోస్ట్ గా ప్రసారమైన రెండు సీజన్స్ భారీ ఆదరణ దక్కించుకున్నాయి. అన్ స్టాపబుల్ షోకి ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ వంటి టాప్ స్టార్స్ రావడం విశేషం. వారి జీవితాల్లోని తెలియని కోణాలను ఈ షో వేదికగా బాలయ్య ఆవిష్కరించారు.

సంబంధిత వార్తలు