Bigg Boss 7 Telugu Rathika: బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ రతికా ఎవరు? ఈమె గురించి షాకింగ్ విషయాలు?
రతికా రోజ్ ఆంధ్రప్రదేశ్ లోనే పుట్టి పెరిగింది. ఇంటర్ తరువాత పై చదువుల కోసం హైదరాబాద్ కు వచ్చింది. ఇక్కడ ఇక్కడ అకడమిక్ చదువులపై దృష్టి పెట్టింది. ఇదే సమయంలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది.

Bigg Boss 7 Telugu Rathika: బుల్లితెరపై ప్రత్యేక షో బిగ్ బాస్ సందడి చేస్తోంది. ఈ షో సీజన్ 7 ఆదివారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. ఈ తరునంలో 10వ కంటెస్టెంట్ గా పరిచయం అయింది రతికా. మెగాస్టార్ చిరంజీవి సాంగ్ లో వేదికపైకి వచ్చి నాగార్జునతో కలిసి డ్యాన్స్ చేసింది. అయితే అంతకుముందు రతికా అనగానే చాలా మంది ‘అశోకవనంలో అర్జునుడు’ హీరోయిన్ రతికా అనుకున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఆమె ఫొటోలు పెట్టి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందంటూ సందడి చేశారు. కానీ లాస్ట్ మినిట్ లో వేరే రతికి అని తెలుసుకొని ఖంగు తిన్నారు. మరి ఈ రతికా పర్సనల్ విషయాల్లోకి వెళితే..
రతికా రోజ్ ఆంధ్రప్రదేశ్ లోనే పుట్టి పెరిగింది. ఇంటర్ తరువాత పై చదువుల కోసం హైదరాబాద్ కు వచ్చింది. ఇక్కడ ఇక్కడ అకడమిక్ చదువులపై దృష్టి పెట్టింది. ఇదే సమయంలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఈ క్రమంలో ఆమెకు సినిమాపై మోజు కలగడంతో వెండితెరపై కనిపించాలనే ఆశ పుట్టింది. దీంతో చదువు పూర్తయిన తరువాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అలా కొన్ని రోజులు పాటు ఇందులో కొనసాగిన ఆమెకు 2020లో ‘బొమ్మ అదిరింది.. దిమ్మ తిరిగింది’ అనే సినిమాలో అవకాశం వచ్చింది. షకలక శంకర్ ఇందులో హీరో. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయినా ఆ తరువాత రతికాకు సినిమా అవకాశాలు తలుపుతట్టాయి.
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్ రెండో కుమారుడు గణేశ్ హీరోగా వచ్చిన ‘నేను స్టూడెంట్ సర్’ అనే సినిమాలో ఓ పోలీస్ అధికారి పాత్రలో నటించింది. ఇలా తక్కువ సినిమాల్లో నటించినా ఇన్ స్ట్రాగ్రామ్ లో రతికా ఫుల్ యాక్టివ్ గా ఉండేది. ఇటీవల దసరా సినిమాలోని ‘చెమ్కీల అంగిలేసి’ అనే సాంగ్ కు చేసిన డ్యాన్ష్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో ఆమె ఇన్ స్ట్రాగ్రామ్ ఖాతాకు 13 మిలియిన్ల మంది ఫాలోవర్స్ పెరిగాయి.
ఇలా పాపులర్ అయిన రతికా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే చాన్స్ దక్కించుకుంది. సినిమాల్లో తన నటనతో ఎంతో ఆకట్టుకున్న ఈ భామ బిగ్ బాస్ లో విన్నర్ కావాలని కొందరు అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఆమె ఇన్ స్ట్రాగ్రామ్ కు ఆల్ ది బెస్ట్ అంటూ మెసేజ్ లు పెడుతున్నారు. అయితే మిగతా కంటెస్టెంట్లకంటే రతికా రోజ్ ఏ విధంగా బిగ్ బాస్ ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి.
