Family Star: ఫ్యామిలీ స్టార్ సినిమా విషయం లో దిల్ రాజు కి, డైరెక్టర్ కి మధ్య జరిగే గొడవకి కారణం ఎవరు..?
పరశురాం డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ఇందులో విజయ్ ఫ్యామిలీ మెన్ గా ఒక అద్భుతమైన పాత్రను పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది.

Family Star: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న దిల్ రాజు వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపు పొందాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటుగా ప్రొడ్యూసర్ గా కూడా ఆయన మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన పరశురాం డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ఇందులో విజయ్ ఫ్యామిలీ మెన్ గా ఒక అద్భుతమైన పాత్రను పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ని చూస్తే మనకు ఈ విషయం అర్థమవుతుంది. అయితే విజయ్ పరుశురాం కాంబినేషన్ లో ఇంతకుముందే గీత గోవిందం లాంటి సినిమా వచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఈ సినిమా పైన కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెకండాఫ్ కథ పరంగా దిల్ రాజు అంతా సంతృప్తి గా లేడని తెలుస్తుంది.ఇక అందువల్లే కథ మార్చి మళ్ళీ షూట్ చేద్దామని పరశురామ్ తో చెప్పినట్టుగా తెలుస్తుంది.
ఇక దానికి మాత్రం పరుశురాం ఒప్పుకోవడం లేదనే మాటలు అయితే వినిపిస్తున్నాయి. దానివల్లే దిల్ రాజు పరశురాం మీద కొంచెం సీరియస్ అయినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. దాని ప్రకారమే వీళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ సినిమా విషయంలో ఎవరి డెసిజన్ కరెక్ట్ అనేది ఎవరికీ తెలియదు.కానీ దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఆయనకు మంచి అనుభవం ఉంది కాబట్టి ఒక స్టోరీని జడ్జ్ చేసే కెపాసిటీ ఆయనకి ఉంది కాబట్టి ఈ సినిమా విషయంలో ఆయన చెప్పిన సజెషన్స్ తీసుకుంటే అది సినిమాకి బాగా హెల్ప్ అవుతుందని పలువురు సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు…
ఇక ఇది ఇలా ఉంటే ఇప్పటికే విజయ్ కి చాలా రోజుల నుంచి సరైనా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఇక ఇలాంటి క్రమం లో మళ్లీ వీళ్ళ గొడవల వల్ల ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆయన అలాగే ఆయన అభిమానులు కూడా ఆందోళన పడుతున్నారు. ఇక రీసెంట్ గా భారీ అంచనాలతో వచ్చిన ఖుషి సినిమా అంత పెద్ద సక్సెస్ సాధించలేదు కాబట్టి ఇప్పుడు విజయ్ ఆశలన్నీ ఈ సినిమా మీదనే ఉన్నాయి…
