Basara IIIT : బాసర మరణాలకు బాధ్యులెవరు.. వర్సిటీలో భద్రత ఎంత.. భయమెంత!?
కేవలం వేతనాల కోసం పనిచేసే అధ్యాపకులు, వార్డెన్ల కారణంగానే లిఖిత మరణించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో వాదన ఏంటంటే అధ్యాపకుల వేధింపులే విద్యార్థులను బలి తీసుకుంటున్నాయని కూడా కొంతమంది పేర్కొంటున్నారు.

Basara IIIT : ట్రిపుల్ ఐటీ… పదో తరగతి తర్వాత అత్యున్నత ప్రమాణాలతో అందుబాటులోకి సాంకేతిక విద్య. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి చొరవతో ఉమ్మడి ఆధ్రప్రదేశ్‌లోని కడపలో, తెలంగాణ ప్రాంతంలోని బాసరలో ఈ ట్రిపుల్ ఐటీలను నెలకొల్పారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ చదివి ఉన్నత స్థాయికి ఎదిగారు. దేశ విదేశాల్లోని ప్రముఖ కంపెనీల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న విద్యాసంస్థలు కావడంతో ట్రిపుల్ ఐటీలో సీటు కోసం ఏటా పోటీపడే వారి సంఖ్య పెరుగుతోంది. ట్రిపుల్‌ఐటీలో చేరితో భవిష్యత్‌కు ఢోకా ఉండది అన్న నమ్మకం తల్లిదండ్రుల్లోనూ ఏర్పడడమే ఇందుకు కారణం. ఆరేళ్లు కష్టపడితే తమ పిల్లలు జీవితంలో సెటిల్ ఐపోతారు అని భావిస్తున్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న బాసర ట్రిపుల్ ఐటీలో కొన్ని ఘటనలు మాయని మచ్చలా మిగిలిపోతున్నాయి.
