కరోనా జన్యుక్రమాన్ని గుర్తించిన డబ్ల్యూహెచ్‌వో

కరోనా వైరస్‌ లేదా కోవిడ్‌ 19 వ్యాధికి ఎనిమిది వారాలు నిండాయి. ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్‌ చైనాలోని వుహాన్‌ సిటీ నుంచి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో… ఈ వైరస్‌కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ కీలక ప్రకటన చేసింది. కరోనా వైరస్‌కు సంబంధించిన జన్యు క్రమాన్ని (జెనటిక సీక్వెన్స్‌) గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌వో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్‌లో టెక్నికల్‌ లీడ్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ మారియా వాన్‌ కెర్కోవ్‌ తెలిపారు. నేడు ఈ అంశంపై ఆమె […]

  • Written By: Neelambaram
  • Published On:
కరోనా జన్యుక్రమాన్ని గుర్తించిన డబ్ల్యూహెచ్‌వో

కరోనా వైరస్‌ లేదా కోవిడ్‌ 19 వ్యాధికి ఎనిమిది వారాలు నిండాయి. ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్‌ చైనాలోని వుహాన్‌ సిటీ నుంచి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో… ఈ వైరస్‌కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ కీలక ప్రకటన చేసింది.

కరోనా వైరస్‌కు సంబంధించిన జన్యు క్రమాన్ని (జెనటిక సీక్వెన్స్‌) గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌వో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్‌లో టెక్నికల్‌ లీడ్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ మారియా వాన్‌ కెర్కోవ్‌ తెలిపారు. నేడు ఈ అంశంపై ఆమె మీడియాతో మాట్లాడుతూ… వైరస్‌కు సంబంధించిన జెనటిక్‌ విశ్లేషణ జరుగుతోందని పేర్కొన్నారు.

పాలీమిరేజ్‌ చైన్‌ రియాక్షన్‌ (పీసీఆర్‌) తో పాటు సీరాలిజికల్‌ విశ్లేషణను పరిశోధనశాలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. కొత్త వ్యాధిగా రూపాంతరం చెందిన కరోనా వైరస్‌కు సంబంధించి కావాల్సినంత సమాచారం తమ దగ్గర ఉందని కెర్కోవ్‌ చెప్పారు. వైరస్‌ను అతి తక్కువ సమయంలో గుర్తించడం అసాధారణమైన విషయమని తెలిపారు.

వైరస్‌కు చెందిన జన్యు క్రమాన్ని కొన్ని రోజుల క్రితమే షేర్‌ చేసినట్లు తెలిపారు. ఇక ఇప్పుడు సిరాలాజికల్‌ అధ్యయనం సాగుతుందన్నారు. చైనాతో పాటు బాధిత ప్రపంచ దేశాలు కరోనా పాజిటివ్‌ వ్యక్తుల సీరమ్‌ను పరీక్ష చేయవచ్చునని పేర్కొన్నారు.

కరోనా వైరస్‌పై గురువారం నిర్వహించిన రాజ్యసభలో ప్రకటన చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు చేయకముందే.. కేంద్ర ప్రభుత్వం వైరస్‌ నియంత్రణకు అన్ని ఏర్పాటు చేసిన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ రాజ్యసభలో తెలిపారు. మార్చి 4 వ తేదీ వరకు దేశంలో 29 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు మంత్రి వెల్లడించారు.

ప్రతి రోజూ పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు మంత్రి చెప్పారు. మంత్రుల బృందం కూడా ఎప్పటికప్పుడు కరోనా పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రయాణికుల స్క్రీనింగ్‌ ఇక నుంచి కచ్చితంగా చేపట్టనున్నట్లు తెలిపారు. సుమారు 29 వేల మందిని మానిటర్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు