RRR On Oscar: గత ఏడాది విడుదలైన రాజమౌళి #RRR చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే..కేవలం బాక్స్ ఆఫీస్ పరంగా మాత్రమే కాదు.. పాన్ వరల్డ్ రేంజ్ క్రిటిక్స్ నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం..లేటెస్ట్ గానే ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్’ మరియు ‘లాస్ ఏంజిల్స్ ఫిలిం క్రిటిక్స్’ అవార్డుని కూడా సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ లో నామినేషన్స్ దక్కించుకుంటుందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది..మరి కొద్దీ గంటల్లో ఆస్కార్ అవార్డ్స్ లో #RRR కి చోటు దక్కుతుందా లేదా అనేది తెలియనుంది..అయితే గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ కి ఆస్కార్ అవార్డు దక్కే అవకాశం ఉందని మన ఎల్లో మీడియా ఒక రేంజ్ లో ప్రచారం చేసింది..తమ వర్గపు హీరో ఉంటె అవతల హీరోని తగ్గిస్తూ తమ హీరోని అమాంతం ఆకాశానికి తీసుకెళ్లే ప్రయత్నం చేసే పచ్చ మీడియా ఇప్పుడు మాత్రం సైలెంట్ గా ఎందుకు ఉంటుంది.

RRR On Oscar
దశాబ్దాల నుండి తమ ఆయుధాలుగా మార్చుకున్న మీడియా తో ‘ఆస్కార్ కి అడుగు దూరం లో ఎన్టీఆర్’ అంటూ ఊదరగొట్టేసింది..అయితే ఒక్క ‘వెరైటీ’ అనే మ్యాగజైన్ తప్ప ఏ ఇతర మ్యాగజైన్ కూడా ఎన్టీఆర్ కి ఆస్కార్ అవార్డు దక్కే ఛాన్స్ ఉందని చెప్పలేదు..ఆ ‘వెరైటీ’ మ్యాగజైన్ లో ఉన్న ఒక ఎడిటర్ ‘మార్క్ మల్కిన్’ ఎన్టీఆర్ కి మరియు రాజమౌళి కుమారుడు కార్తికేయ కి బాగా క్లోజ్..మార్క్ మల్కిన్ కి ప్రత్యేకంగా ఎన్టీఆర్ ఈమధ్యనే ఒక బహుమతి కూడా ఇచ్చాడు..అతని చేత ‘వెరైటీ’ మ్యాగజైన్ లో పదే పదే ఎన్టీఆర్ కి ఆస్కార్ అవార్డు వస్తుందంటూ ప్రచారం చేయించాడు..ఇక్కడ కూడా సోషల్ మీడియా లో ఉన్న పేజెస్ తో ఒక రేంజ్ లో ప్రొమోషన్స్ ఎన్టీఆర్ కోసం చేయించాడు కార్తికేయ..ఇలా అసలు పాజిబులిటీ లేని చోట ఎందుకు ఎన్టీఆర్ ని అమాంతం పెంచి, రామ్ చరణ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకసారి విశ్లేషిద్దాం.
#RRR సినిమా విడుదలైనప్పుడు ఎన్టీఆర్ అభిమానులు రాజమౌళి ని ఒక రేంజ్ లో తిడుతారు..ఎందుకంటే ఇందులో మెయిన్ హీరో రోల్ రామ్ చరణ్ కి ఇప్పించి, మా హీరో కి సపోర్టింగ్ రోల్ ఇప్పించారంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ గోల చేసారు..ఎన్టీఆర్ కూడా వస్తున్నా ఈ ఫీడ్ బ్యాక్ ని మొత్తం గమనించి కాస్త నిరాశకి గురయ్యాడు..ఎన్టీఆర్ ని మరియు ఆయన అభిమానులను శాంతపర్చడానికే రాజమౌళి మరియు ఆయన టీం ఇలా ప్రచారం చేయించారని..ఒకవేళ నామినేషన్స్ లో చోటు దక్కకపోయినా ఈ ప్రచారం వల్ల చివరి దాకా వెళ్లి వచ్చాడనే పేరైన ఉంటుందనే ఉద్దేశ్యం తోనే ఇలా చేయించారని ఫిలిం ఇండస్ట్రీ లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది..ఎన్టీఆర్ కి నిజంగా ఆస్కార్ అవార్డు వస్తే సంతోషమే..కానీ ఇలా బలవంతపు రుద్దుడు రుద్ది, ఒక హీరో ని ఆ హీరో అభిమానులను బాధపెట్టడం సరికాదు.

RRR On Oscar
ఈ సినిమాలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఇద్దరూ కూడా అద్భుతంగా నటించారు..ఒకరు ఎక్కువ అని కాదు, ఒకడు తక్కువ అని కాదు..అలాంటప్పుడు నామినెటే అయితే ఇద్దరు అవ్వాలి, లేకపోతే అసలు ఎవ్వరూ అవ్వరు కానీ,ఇలా ఒక హీరోకి మాత్రమే ఆస్కార్ లో చోటు ఎలా దక్కుతుందని రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు..నిజానికి #RRR చిత్రం లో మెయిన్ హీరో రామ్ చరణ్..ఈ విషయం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కూడా తెలుసు..చూసే ప్రతీ ఒక్కరికి ఎన్టీఆర్ సపోర్టింగ్ క్యారక్టర్ అనే విషయం అర్థం అవుతుంది..ఒకవేళ నామినేట్ ‘బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్’ క్యారగిరీ లో నామినేట్ అవుతాడు కానీ..ఉత్తమ నటుడు క్యాటగిరి లో ఎలా నామినేట్ అవుతాడు అంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు..అయితే ఎన్టీఆర్ కి ప్రచారం చేయించినట్టే ఆస్కార్ నామినేషన్స్ లో స్థానం దక్కుతుందో లేదో చూడాలి.