BJP- YCP MLAs: ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఒక వార్త ఎప్పటి నుంచో తెగ సర్వ్యూలట్ అవుతోంది. అదే అదును చూసి బీజేపీ స్టేట్ లో ఎంటరవుతుందన్నది దాని సారాంశం. జగన్ సర్కారుపై ప్రజా వ్యతిరేకత పెరిగినప్పుడు మరింత అచేతనం చేసి వైసీపీని హ్యాండ్ వర్ చేసుకోవాలన్నది కేంద్ర పెద్దల వ్యూహంగా వార్తలు వచ్చాయి. ఒకరిద్దరు వైసీపీ సీనియర్లను అడ్డం పెట్టుకొని బీజేపీ వర్కవుట్ చేస్తుందని కూడా విశ్లేషణలు వచ్చాయి. అయితే అవన్నీ ఒట్టి మాటలే అంటూ వైసీపీ హైకమాండ్ లైట్ తీసుకుంది. కానీ ఇటీవల తన సహచర మిత్రుడు, రాజకీయ శ్రేయోభిలాషి కేసీఆర్ నుంచి సమాచారం అందేసరికి జగన్ కు గట్టి షాకే తగిలింది. తన వెనుక ఇంత తతంగం జరుగుతుందా? అని ఆయన తెగ హైరానా పడిపోయారట. అలాగని ఇప్పటికిప్పుడు దానిని బయటపెడితే వచ్చే పర్యవసానాలు జగన్ కు తెలుసు కదా.. అందుకే సైలెంట్ అయ్యారు. ముందుగా తనకు తాను జాగ్రత్త పడుతున్నారు. అందుకే వర్కుషాపులు, సమీక్షలంటూ హడావుడి చేస్తున్నారు. బీజేపీ నుంచి పార్టీని కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు… సొంత పార్టీ నేతలతో పాటు విపక్షాలకు ముందస్తు ఎన్నికల సంకేతాలుగా అర్ధమయ్యాయి. కానీ లోలోపల మాత్రం జగన్ ఆవేదనతో రగిలిపోతున్నారు.

BJP- YCP MLAs
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభం కేసులో కొందరు కీలక పెద్దల పేర్లు బయటపడ్డాయి. ఒక ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ కంటే ముందే ఏపీలో బీజేపీ ఆపరేషన్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. దాదాపు 70 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు ఈ ముఠా టచ్ లోకి వెళ్లినట్టు సమాచారం. అయితే దీనిపై ఎటువంటి ఆధారాలు చిక్కాయో లేదో తెలియదు కానీ..ఏపీలో మాత్రం బీజేపీ ఆపరేషన్ మొదలు పెట్టిందని మాత్రం బయటపడింది. అటు జగన్ సైతం కన్ఫర్మ్ చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటికిప్పుడు బీజేపీ తో ఫైట్ కు జగన్ సిద్ధంగా లేరు. అందుకే ఒపిగ్గా పరిణామాలను గమనిస్తున్నారు. సార్ .. సార్ అంటూనే మోదీ చేష్టలపై ఆగ్రహంగా ఉన్న జగన్ మరికొద్దిరోజుల పాటు అదే పంథాను కొనసాగించక తప్పని పరిస్థితి.
తెలంగాణ సీఎం నుంచి వచ్చిన సమాచారంపై వైసీపీలో అంతర్గతంగా చర్చనడుస్తోంది. ముఠాకు టచ్ లోకి వెళ్లిన ఆ 70 మంది ఎమ్మెల్యేలు ఎవరు? అసలు బీజేపీ ప్లాన్ ఏంటి? అన్నవిశ్లేషణలు మాత్రం ప్రారంభమయ్యాయి. దీని వెనుక ఒకరిద్దరు సీనియర్లు సైతం ఉన్నారన్న టాక్ కూడా ఉంది. మహరాష్ట్ర ఎపిసోడ్ మాదిరిగా షిండే ఎవరన్నదానిపై పార్టీలో లోతుగా చర్చ నడుస్తోంది. అటు జగన్ కుటుంబసభ్యుల్లో ఒకరిద్దరి పాత్ర కూడా ఉందన్న ప్రచారం ఉంది. అయితే ఇప్పటివరకూ ఇవి అనుమానాలుగానే ఉన్నా.. జరుగుతున్నపరిణామాలు మాత్రం అనుమానాలకు నిజం చేకూరుస్తున్నాయి.. అటు కుటుంబ వ్యవహారం కూడా రచ్చగా మారింది. వివేకానందరెడ్డి ఎపిసోడ్ తో కుటుంబం నిట్టనిలువునా చీలిపోయింది. అటు సోదరి షర్మిళ, తల్లి విజయమ్మ రూపంలో కొత్త చికాకులు ఎదురవుతున్నాయి.

BJP- YCP MLAs
ఆ మధ్యన బీజేపీ అనుకూల మీడియాలో వైసీపీ వ్యతిరేక కథనాలు వచ్చాయి. తిరుగుబాటు తధ్యమన్న రేంజ్ లో హెచ్చరికలు కూడా వచ్చాయి. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం కొద్ది నెలల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని అర్ధం వచ్చేలా మాట్లాడారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీలో ఏదో అంతర్గతంగా జరుగుతుందన్న టాక్ అయితే వినిపిస్తోంది. దానికి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశముంది. అటు వైసీపీ పెద్దలు సైతం ఎమ్మెల్యేల జాబితా పట్టుకొని తిరుగుతున్నారు. బహుశా ఈ అసహనంతో ఉన్న జగన్ ఎమ్మెల్యేలంటేనే కసురుకొంటున్నారు. మిమ్మల్ని మార్చేస్తానంటూ హెచ్చరికలు పంపుతున్నారు. ఇప్పటికే బీజేపీ ముఠాకు టచ్ లోకి వెళ్లిన వారి పేర్లను సైడ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే మున్ముందు మహరాష్ట్ర ఎపిసోడ్ తరహాలో బీజేపీ ఆపరేషన్ షురూ చేసే అవకాశముందన్న వార్త అధికార పార్టీ నేతలను కలవరపాటుకు గురిచేస్తోంది.