‘వెండితెర’కు ఆస్కార్ అవార్డ్ ఓ కలల స్వప్నం. ప్రపంచ సినీ లోకంలో ఆస్కార్ ఓ తిరుగులేని రారాజు. అందుకే సినిమా గాలి పీల్చుకున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఆస్కార్ అవార్డ్ ను అందుకోవాలని, కనీసం ఆస్కార్ కోసం పోటీపడాలని.. ఒకవేళ ఆ పోటీలో ఆస్కార్ గెలిస్తే, ఇక జీవితం ధన్యమై పోయిందని భావిస్తుంటారు. మొత్తమ్మీద అందమైన అబద్దపు సామ్రాజ్యంలో ఆస్కార్ అందమైన యువరాణిలా అందర్నీ ఊరిస్తూ ఉంటుంది.
ఆస్కార్ అంత అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది కాబట్టే… మన ఇండియన్ సినిమాలు కూడా పోటీపడుతూ ఉంటాయి. నిజానికి ప్రతి సంవత్సరం జస్ట్ నామినేషన్ లలోకి మన ఇండియన్ సినిమా వెళ్ళింది అంటేనే.. ఆ సినిమా కచ్చితంగా గొప్పది అయి ఉంటుందని ఫీల్ అయ్యేంతగా ఆస్కార్ ను పరిగణలోకి తీసుకుంటారు మన వాళ్ళు. అందుకే ఇండియాలో కూడా ప్రతి ఆస్కార్ అవార్డు పై చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ఈ సారి కూడా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది.
కరోనా వైరస్ కారణంగా గతేడాది నుంచి ఎన్నోసార్లు వాయిదా పడటంతో.. ఈ ఏడాది వేడుక మరింత కన్నుల పండువగా జరుగుతోంది. అయితే కరోనా కారణంగా ఈ వేడుకను మొట్టమొదటిసారి రెండు ప్రాంతాల్లో జరుపుతున్నారు. కాగా 93వ అకాడమీ అవార్డుల్లో వివిధ విభాగాల్లో ఎంతోమంది దర్శకులు, నటీనటులు పోటీ పడుతున్నారు. ఐతే ‘నో మ్యాడ్లాండ్’ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకురాలిగా క్లోవీ చావ్ను ఆస్కార్ వరించింది. దీంతో పాటు ఉత్తమ సంగీతం, ఉత్తమ సహాయ నటుడు అవార్డులను కూడా ప్రకటించారు.
ఒకసారి విజేతలను పరిశీలిస్తే
ఉత్తమ దర్శకురాలిగా అవార్డు గెలుపొందిన క్లోవీ చావ్
ఉత్తమ చిత్రం: నోమ్యాడ్ ల్యాండ్
ఉత్తమ దర్శకురాలు: క్లోవీ చావ్ (నోమ్యాడ్ ల్యాండ్)
ఉత్తమ సహాయ నటుడు: డానియెల్ కలువోయా (జుడాస్ అండ్ ది బ్లాక్ మిస్సయా)
ఉత్తమ సహాయ నటి: యున్ యా జంగ్ (మినారి)
ఉత్తమ సౌండ్: సౌండ్ ఆఫ్ మెటల్
ఉత్తమ సినిమాటోగ్రఫి: ఎరిక్ (మ్యాంక్)
(ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ అందుకున్న యున్ యా జంగ్)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ప్లే: ఎమరాల్డ్ ఫెన్నెల్ (ప్రామిసింగ్ యంగ్ ఉమెన్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ప్లే : క్రిస్టోఫర్ హామ్టన్, ఫ్లొరియన్ జెల్లర్ (ది ఫాదర్)
ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: అనదర్ రౌండ్ (డెన్మార్క్)
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్: అంథోనీ (కలెక్టివ్)
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్: పిపా, జేమ్స్ రీడ్, క్రేగ్ ఫాస్టర్ (మై ఆక్టోపస్ టీచర్)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: ఆండ్రూ జాక్సన్, డేవిడ్ లీ (టెనెట్)
ఉత్తమ ప్రొడెక్షన్ డిజైన్: డోనాల్డ్ బర్ట్ (మ్యాంక్)
ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: సెర్హియోలోఫెజ్, మియానీల్, జమికా విల్సన్ (మా రైనీస్ బ్లాక్ బాటమ్)
ఉత్తమ క్యాస్టూమ్ డిజైన్: అన్రాత్ (మా రైనీస్ బ్లాక్ బాటమ్)
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: మార్టిన్ డెస్మండ్ రాయ్ (టూ డిస్టెంట్ స్ట్రేంజర్స్)
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: మైకల్ గ్రోవియర్ (ఇఫ్ ఎనిథింగ్ హ్యాపెన్స్ ఐ లవ్ యూ)
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: పీట్ డాక్టర్, దానా మరీ (సోల్)
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Who are the winners of the prestigious oscar
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com