Heroines Remuneration: టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్లు ఎవరు? వారి రేటు ఎంత?
సమంత సినిమాలు ఈ మధ్య మిశ్రమ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. కొన్ని డిజాస్టర్ ఫలితాలను సొంతం చేసుకుంటే.. మరికొన్ని సినిమాలు సూపర్ హిట్ ను సొంతం చేసుకుంటున్నాయి.

Heroines Remuneration: సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలంటే దానికి సంబంధించిన పనులు ఎంతో మంది నిర్వహించాల్సి ఉంటుంది. హీరోహీరోయిన్ లతో పాటు ఎంతో మంది సినిమా కోసం కష్టపడుతుంటారు. అయితే హీరోలతో పోలిస్తే హీరోయిన్ల రెమ్యూనరేషన్ చాలా తక్కువ. మరి మన టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల రెమ్యూనరేషన్ ఎంతనో తెలుసుకుందాం…
నయనతారకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్ గా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో ప్రముఖ పాత్ర పోషించి అందరి మనుసులు దోచుకుంది ఈ తార. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి థియేటర్లలో ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా కోసం నయనతార తీసుకున్న రెమ్యూనరేషన్ అందరిని షాక్ కు గురి చేస్తుంది. ఈ సినిమాలో నయనతార నటించినందుకు గాను 11 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుందట. దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ల లిస్టులో నయనతార పేరు ముందుంటుంది. దీన్ని ఈ సారి మరింత పెంచి ఈ సినిమా కోసం ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంది. అయితే ఈమెకు ఉన్నా క్రేజ్ ను బట్టి సినిమా నిర్మాతలు కూడా అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఏమాత్రం వెనకడుగు వేయలేదట.
సమంత సినిమాలు ఈ మధ్య మిశ్రమ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. కొన్ని డిజాస్టర్ ఫలితాలను సొంతం చేసుకుంటే.. మరికొన్ని సినిమాలు సూపర్ హిట్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఇక పాన్ ఇండియా హీరోయిన్ గా చలామణి అవుతున్న సమంత ఒకవైపు సినిమాలు మరొకవైపు వెబ్ సిరీస్ లో చేస్తూ బిజీగా మారింది. ఇటీవల విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమాలో నటించిన ఈమె ఏకంగా రూ.6 నుంచి రూ .8 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇలా సమంత కూడా ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకుంటుంది.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ హీరోలు అందరితో కలిసి నటించిన అనుష్క చాలాకాలం ఇండస్ట్రీకి గ్యాప్ తీసుకొంది. తిరిగి మళ్ళీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఇక ఈ సినిమా కు స్వీటీ రూ .6కోట్ల పారితోషకం తీసుకున్నట్లు తెలుస్తోంది. బాహుబలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న అనుష్క కంటిన్యూగా సినిమాలు చేసి ఉంటే.. ఇప్పటికి ఆమె రెమ్యూనరేషన్ ఫుల్ గా పెరిగి ఉండేదని టాక్. గ్యాప్ ఇచ్చినా.. టాప్ లిస్ట్ లోనే ఉంది స్వీటీ.
నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. మరొకవైపు యానిమల్ చిత్రంలో కూడా అవకాశం దక్కించుకుంది. ఈ క్రమంలోనే రష్మిక రూ .6 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. వారిసుడు సినిమాకు అమ్మడు రూ. 4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంది. పుష్ప 2 కోసం ఏకంగా 6 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట అమ్మడు.
