BJP – Pawankalyan : బీజేపీ ఎటు వైపు.? పవన్ కళ్యాణ్ ఆశలు తీరేనా?

బీజేపీ కోసం చంద్రబాబు, పవన్ వెయిట్ చేస్తున్నారు. కానీ  వైసీపీతోనే ఉండిపోవాని బీజేపీ దాదాపు నిర్ణయించుకున్నట్లుగా క్లారిటీ వస్తోంది.

  • Written By: Dharma Raj
  • Published On:
BJP – Pawankalyan : బీజేపీ ఎటు వైపు.? పవన్ కళ్యాణ్ ఆశలు తీరేనా?

BJP – Pawankalyan : ఏపీలో అసలు సిసలు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఎన్నికలు సమీపించడంతో కొన్నిరకాల అంచనాలు పటాపంచలవుతున్నాయి. అనుమానాలకు బలం చేకూరడంతో పాటు ఫుల్ క్లారిటీ వస్తోంది. ఎవరికి ఎవరు మిత్రులో.. ఎవరు శత్రువులో ఫుల్ పిక్చర్ వస్తోంది. బీజేపీని కలుపుకెళతామని అటు చంద్రబాబు, ఇటు పవన్ భావిస్తున్నారు. కానీ అంతగా వర్కవుట్ అయ్యేలా లేదు. బీజేపీ అంతరంగం వేరేలా ఉంది. మెత్తబడుతూనే తన పని తాను చేసుకుంటూ పోతోంది. వైసీపీ వైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. జగన్ సర్కారుకు ఇతోధికంగా సాయమందిస్తోంది. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించి ప్రజాభిమానం మెండుగాఉంచేందుకు తాపత్రయ పడుతోంది.

2014 ఎన్టీఏ సర్కారు అధికారంలోకి వచ్చింది. దేశంలో, రాష్ట్రంలో బీజేపీ,టీడీపీ అధికారం పంచుకున్నాయి. విభజిత ఏపీకి నిధుల వరద పారుతుందని అంతా భావించారు. కానీ కేంద్రం నుంచి సహాయ నిరాకరణే ఎదురైంది. చంద్రబాబు నిధులు అడగడం.. మోదీ సర్కారు మొండిచేయి చూపడం పరిపాటిగా మారింది. నిధులు అడిగిన పాపానికి అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వెటకారపు సమాధానంతో చంద్రబాబు మైండ్ బ్లాక్ అయ్యింది. దేశభద్రతకు కేటాయించిన నిధులు మీకివ్వాలా అంటూ ఆయన చెప్పిన సమాధానం మరీ ఇబ్బందికరంగా మారింది. కానీ ఇప్పుడవే నిధులు జగన్ సర్కారుకు ఇచ్చారు. నాడు చంద్రబాబు ఇవే నిధుల కోసం ప్రయత్నాలు చేసి విసిగిపోయారు. చివరకు ఎన్టీఏ నుంచి వైదొలిగారు.

అయితే జగన్ తన చర్యలతో రాష్ట్ర భవిష్యత్ ను పాడుచేస్తున్నారన్న అపవాదు. దానిని గాడిలో పెట్టాల్సింది పోయి..ఇప్పుడు లోటు భర్తీ నిధులు రూ.10 వేల కోట్లను జగన్ చేతిలో పెట్టారని తెలుస్తోంది.  దీంతో ఏపీ ప్రభుత్వం పండగ చేసుకోనుంది. ఈ ఏడాది మీట నొక్కాల్సిన పథకాలు.. రైతు భరోసా, అమ్మఒడి వంటి వాటికి ఆ నిధులు సరిపోతాయి. అంతేనా.. ప్రతీ వారం రూ. రెండు వేల కోట్లు అప్పులకు కేంద్రం పర్మిషన్ ఇస్తోంది. దీంతో ఏపీ ప్రభుత్వం.. బటన్ నొక్కే కష్టాలు తీరిపోయినట్లే. ఎన్నికలకు హాయిగావెళ్లేందుకు మార్గం సుగమం చేసినట్టే. జగన్  తలపై పాలుపోసినట్టే.

బీజేపీ కోసం చంద్రబాబు, పవన్ వెయిట్ చేస్తున్నారు. కానీ  వైసీపీతోనే ఉండిపోవాని బీజేపీ దాదాపు నిర్ణయించుకున్నట్లుగా క్లారిటీ వస్తోంది. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం దివాలా తీయిస్తున్నా.. కేంద్రం పట్టించుకోవడం లేదని..ఎప్పటికైనా మారుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.  కానీ అప్పులే కాదు..గతంలో ఇవ్వాల్సిన నిధులు కూడా ఇప్పుడు ఇస్తూ..జగన్ సర్కార్ కు మేలు చేస్తోంది. ఎలా చూసినా ఇక బీజేపీని నమ్ముకోవడం అంటే.. దండగ అన్న అభిప్రాయానికి అందరూ వస్తున్నారు . అయితే ఇంకా చంద్రబాబు, పవన్ కు నమ్మశక్యం కుదిరినట్టు లేదు. అందుకే ఇంకా వెయిటింగ్ కే మొగ్గుచూపుతున్నారు.

సంబంధిత వార్తలు