త్రివిక్రమ్-ఎన్టీఆర్ మూవీలో ఏ హీరోయిన్ నటించబోతుంది..?

ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మొన్నటి వరకూ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తరువాత ఎవరితో సినిమా తీస్తారు అని తెగ వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలన్నిటికీ బ్రేక్ వేస్తూ ఎన్టీఆర్ తర్వాత సినిమా త్రివిక్రమ్ తోనే అని అధికారికంగా ప్రకటించారు.ఇప్పుడు ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి చర్చలు జరుగుతున్నాయి. త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా వస్తుంది అన్నప్పుడే మొదట పూజా హెగ్డే పేరు వినిపించింది. అరవింద సమేత […]

  • Written By: Raghava
  • Published On:
త్రివిక్రమ్-ఎన్టీఆర్ మూవీలో ఏ  హీరోయిన్ నటించబోతుంది..?

ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మొన్నటి వరకూ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తరువాత ఎవరితో సినిమా తీస్తారు అని తెగ వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలన్నిటికీ బ్రేక్ వేస్తూ ఎన్టీఆర్ తర్వాత సినిమా త్రివిక్రమ్ తోనే అని అధికారికంగా ప్రకటించారు.ఇప్పుడు ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి చర్చలు జరుగుతున్నాయి.

త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా వస్తుంది అన్నప్పుడే మొదట పూజా హెగ్డే పేరు వినిపించింది. అరవింద సమేత సినిమాలో వీరిద్దరూ కలిసి నటించగా మళ్ళీ పూజాహెగ్డే నే హీరోయిన్ గా తీసుకోవాలని త్రివిక్రమ్ అనుకున్నారట. ఆ తర్వాత ఈ సినిమాలో రష్మిక మందన్న నటించనున్నట్టు వినిపించింది. ప్రస్తుతం వరుస హిట్స్ తో దూసుకుపోతున్న రష్మిక ను తీసుకుంటే సినిమాకు ప్లస్ అవుతుందన్న టాక్స్ వినిపించాయి. అంతే కాదు రష్మిక ఇప్పటి వరకూ ఎన్టీఆర్ తో జత కట్టలేదు.

వీరిద్దరి తర్వాత తెరపైకి వచ్చిన మరో పేరు సమంత. సమంత కూడా ఈ సినిమాలో నటించే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. ఇప్పటికే ఎన్టీఆర్, సమంత కాంబినేషన్ లో 4 సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా కనుక వస్తే 5వ చిత్రం అవుతుంది. ఫైనల్ గా త్రివిక్రమ్-ఎన్టీఆర్ ఏ హీరోయిన్ కు ఫిక్స్ అవుతారో వేచి చూడాలి .

సంబంధిత వార్తలు