Alcohol: మనదేశంలో మద్యం సేవించడం ఎక్కువే. అందుకే మన ప్రభుత్వాలకు మద్యం ద్వారా వచ్చే ఆదాయమే ప్రధాన వనరుగా మారుతోంది. అందుకే ప్రభుత్వాల మనుగడకు మద్యమే గుండెకాయగా అయిపోతోంది. దీంతో ఆదాయం పెంచుకునే క్రమంలో ప్రభుత్వాలు కూడా తమ బండి నడవాలంటే మద్యాన్నే ఇంధనంగా మార్చుకుంటోంది. ఈ నేపథ్యంలో మద్యం ద్వారానే ప్రభుత్వాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. మద్యం ద్వారానే సర్కారు బండి ముందుకు కదులుతున్నట్లు తెలిసిందే. మందు తాగితే వారికి కిక్కు వస్తుంది ప్రభుత్వానికి మాత్రం ఆదాయం దక్కుతుంది. అందుకే రకరకాల బ్రాండ్లను తీసుకొస్తూ మద్యం ప్రియులను ఆకర్షిస్తున్నట్లు సమాచారం.

Alcohol
మద్యం సేవించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. తాగేటప్పుడు కొన్ని పద్ధతులు పాటిస్తే కిక్కు త్వరగా రాకుండా ఉంటుంది. అందుకే మద్యం తాగేటప్పుడు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలపై శ్రద్ధ తీసుకోవాల్సిందే. ఏది పడితే అది తీసుకుంటే కడుపు నిండుగా అయిపోయి మందు తాగాలని అనిపించదు. అందుకే మద్యం తీసుకునే సమయంలో తీసుకునే ఆహార పదార్థాల విషయంలో తగిన విధంగా ఆలోచించాలి. అడ్డదిడ్డంగా తీసుకునే ఆహారంతో కడుపు కీకారణ్యంగా మారితే తరువాత వచ్చే ఇబ్బందులు తట్టుకోవడం కష్టమే.
Also Read: Devendra Fadnavis: ఆటలో అరటిపండుగా మిగిలిన మాజీ సీఎం ఫడ్నావీస్
అల్కహాల్ తీసుకునేటప్పుడు తీసుకునే ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతోంది. మద్యం తాగేటప్పుడు బీన్స్, కాయధాన్యాలు తీసుకోవద్దు. ఇవి తీసుకుంటే మనకు ఇబ్బందులే ఏర్పడతాయి. ఇందులో ఉండే ఐరన్ మద్యంతో కలిపి తీసుకుంటే పనిచేయదు. అందుకే వాటిని దూరంగా పెడితేనే మేలు. మద్యం ప్రియులు మద్యం తాగేటప్పుడు కాయధాన్యాలు తీసుకోకపోతేనే ప్రయోజనం ఉంటుందని తెలుస్తోంది.

Alcohol
బీరు తాగే సమయంలో బ్రెడ్ తినడం శ్రేయస్కరం కాదు. బీరు తాగితే కడుపు ఉబ్బరంగా ఉంటుంది. రెండు కలిపి తీసుకుంటే త్వరగా జీర్ణం కావు. అజీర్తి సమస్య ఏర్పడుతుంది. అందుకే మద్యం తీసుకునే వారు బ్రెడ్ కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఫ్రెంచ్ ప్రైస్ తీసుకుంటే నష్టమే. అజీర్తి కలుగుతుంది. జీర్ణ ప్రక్రియ దెబ్బ తింటుంది. ఇందులో సోడియం కూడా ఉంటుంది. అందుకే మద్యం ప్రియులు మందు తాగేటప్పుడు ఫ్రెంచ్ ప్రైస్ తీసుకోవడం భావ్యం కాదని తెలుస్తోంది.
అల్కహాల్ తీసుకునే వారు చాక్లెట్ తినొద్దు. ఇందులో కెఫిన్, కోకో, కొవ్వు పదార్థాలు ఉంటాయి. దీంతో మద్యం తాగే సమయంలో చాక్లెట్ కు దూరంగా ఉండాలి. మద్యం తాగేవారు తీసుకునే ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటేనే ప్రయోజనం ఉంటుంది. ఇవన్ని గుర్తించి ఆహారం తీసుకునే క్రమంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:AP Govt GPF Issue: ఉద్యోగుల సొమ్ము నొక్కేసిన ఏపీ సర్కారు? మరీ ఇంత ‘దివాళా’కోరుతనమా?