Aditya L1 Launch: ఆదిత్య ఎల్ -1 కంటే ముందు సూర్యుడిపై ఏ దేశాలు ప్రయోగం చేశాయి?
చంద్రుడిపై అధ్యయనం చేసేందుకు ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా లు ప్రయోగాలు చేశాయి. అయితే ఈ దేశాలు చంద్రుడి ఉపరితలంపై మాత్రమే దిగాయి. దక్షిణ ధ్రువంపై దిగిన మొట్టమొదటి దేశంగా భారత్ నిలిచింది.

Aditya L1 Launch: చంద్రయాన్-3 ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన భారత్ ఇస్రో శాస్త్రవేత్తలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్ -1 అనే ఉపగ్రహాన్ని పంపించనున్నారు.ఇప్పటికే కౌంట్ డౌన్ ప్రారంభమైన ఈ ఉపగ్రహం శనివారం ఉదయం 11.50 నిమిషాలకు నింగిలోకి వెళ్లనుంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే భారత్ మరో ఘనత సాధించిన దేశంగా నిలుస్తుంది. అయితే సూర్యుడిపై అధ్యయనానికి ఇప్పటి వరకు ఏయే దేశం ప్రయోగాలు చేసింది. ఇప్పుడు అవి ఏం చేస్తున్నాయి? అనే వివరాల్లోకి వెళితే.
చంద్రుడిపై అధ్యయనం చేసేందుకు ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా లు ప్రయోగాలు చేశాయి. అయితే ఈ దేశాలు చంద్రుడి ఉపరితలంపై మాత్రమే దిగాయి. దక్షిణ ధ్రువంపై దిగిన మొట్టమొదటి దేశంగా భారత్ నిలిచింది. దీంతో ప్రపంచంలో భారత్ అరుదైన ఘనత సాధించిన దేశంగా నిలిచింది. అయితే సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇప్పటికే కొన్ని దేశాలు ఉపగ్రహాలను పంపించి పరీక్షిస్తున్నాయి.
సౌర మండలం లో సూర్యుడి చుట్టూ ఉన్న కరోనల్ మాస్ ఎజెక్షన్లను పరిశోధించడానికి గత ఏడాది చైనా అడ్వాన్స్డ్ స్పేస్ బేస్డ్ సోలార్ అబ్జర్వేటరీ తో మరొకటి రెండు ఉపగ్రహాలు భూ కక్ష్యలో తిరుగుతున్నాయి. సూర్యుడి అయస్కాంతాన్ని కొలవడానికి జపాన్, యూకె, అమెరికా,యూరప్ అంతరిక్ష ఏజన్సీల సహాయంతో హినోడ్ అనే నౌకను పంపించారు. నాసా, యూరోపియన్ ల ఉమ్మడి ప్రాజెక్టు అయిన సోలార్ అండ్ హీలియోస్పిరిక్ అబ్జర్వేటరీ మిషన్ లాంగ్రాంజ్సమపీలో ఉంది. మరొక సంయుక్త యూరోపియన్ మిషన్ సూర్యునికి దాదాపు 42 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది.
2021లో సూర్యుడి ఎగువ వాతావరణం తెలుసుకునేందుకు అమెరికాలోని పార్కర్ సోలార్ ప్రోబ్ తో సహా ఇతర మిషన్లుఉన్నాయి. ఇప్పుడు ఆదిత్య ఎల్ -1 కూడా ఇక్కడికే పంపిస్తున్నారు. భారత్ ప్రయోగం సక్సెస్ అయితే అంతరిక్ష ప్రయోగాల్లో అగ్ర దేశాల సరసన నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆదిత్య ఎల్ -1 పై దేశంలోని వారే కాకుండా ఇతర దేశాలకు చెందిన వారు ఆసక్తిగా గమనిస్తున్నారు.
