
Shiva Shakti Datta
Shiva Shakti Datta: నాటు నాటు సాంగ్ ని ప్రపంచం మెచ్చింది. ఈ మాస్ బీట్ సాంగ్ ఆస్కార్ గెలుచుకుంది. ఈ పాటకు ఆస్కార్ గెలిచే అర్హత ఉందా? అంటే చెప్పలేం. ఆస్కార్ ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆర్టిస్టిక్ వర్క్ కి మాత్రమే ఇస్తారు. ఆ లెక్కన చూసుకుంటే నాటు నాటు సాంగ్ లో గొప్ప సంగీతం ఏమీ లేదు. జనాల్లోకి బాగా వెళ్ళింది. విపరీతమైన ప్రచారం దక్కించుకుంది. ఆస్కార్ గెలుచుకుంది. అవార్డుకు ఎంపిక చేయడం ద్వారా నాటు నాటు అద్భుతమైన సాంగ్ ని అకాడమీ సభ్యులే ధృవీకరించారు. ఇండియాకు ఆస్కార్ వచ్చిందనే ఆనందం ప్రతి ఒక్కరిలో ఉంది. అదే సమయంలో కొన్ని సందేహాలు కూడా ఏర్పడ్డాయి.
దశాబ్దాలుగా ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్స్ అత్యంత గొప్ప సంగీతం అందించారు. స్వరాలతో రాగాలతో ప్రయోగాలు చేసి బెస్ట్ సాంగ్స్ ఇచ్చారు. కీరవాణి కూడా కెరీర్లో ఆణిముత్యాల్లాంటి సాంగ్స్ కంపోజ్ చేశారు. అయితే అవేమీ ఆస్కార్ గెలుచుకోలేదు. నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ వస్తే మిగతా ఇండియన్స్ సాంగ్స్ సంగతేంటి. ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ ఆస్కార్ కి అప్లై చేయకుండా తప్పు చేశారేమో అన్న భావన కలుగుతుంది. ఒక మాస్ బీట్ సాంగ్ ఆస్కార్ గెలుచుకున్నప్పుడు క్లాసిక్స్ ఎందుకు గెలుచుకోకూడదు?

Shiva Shakti Datta
ఇలాంటి ప్రశ్నలు ఉద్బవిస్తున్నాయి. కాగా కీరవాణి తండ్రి స్వయంగా ఈ ప్రశ్న లేవనెత్తడం హాట్ టాపిక్ అయ్యింది. శివశక్తి దత్తా ఆస్కార్ గెలిచినందుకు కీరవాణిని అభినందిస్తూనే అసహనం వ్యక్తం చేశాడు. కీరవాణి సుదీర్ఘ కెరీర్లో ఎన్నో అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. నాటు నాటు సాంగ్ ఒక పాటేనా? అసలు అందులో సంగీతం ఎక్కడ ఉంది? విధి చిత్ర విచిత్రమైనది. ఈ పాటకు ఆస్కార్ వచ్చింది. అయితే ఇన్నేళ్ల తన కృషికి గుర్తింపు దక్కింది. చంద్రబోస్ దాదాపు ఐదు వేల పాటలు రాశారు. ఆయన రాసిన పాటల్లో నాటు నాటు ఒక పాటా? అని అన్నారు. నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ గెలిచే అర్హత లేదని ఆయన పరోక్షంగా చెప్పినట్లు అయ్యింది.
ఈ పాటకు ప్రాచుర్యం రావడానికి రామ్ చరణ్, ఎన్టీఆర్ లని ఆయన చెప్పారు. వారిద్దరి డాన్స్ నభూతో నభవిష్యత్ అన్నారు. ఈ సాంగ్ కి డాన్స్ కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ ని కూడా మెచ్చుకోవాల్సిందే అనే చెప్పుకొచ్చారు. నాటు నాటు సాంగ్ సక్సెస్ లో ఆర్ ఆర్ ఆర్ హీరోలతో పాటు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ కి ఆయన క్రెడిట్ ఇచ్చారు.