Indus Civilization: ఆనంద్ మహేంద్ర -రాజమౌళి చెప్పిన సింధూ నాగరికత ఎక్కడ ఉంది? ఎంటా కథ? పాకిస్తాన్ ఎందుకు అడ్డుకుంది?
ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో “దేశీ థగ్” గ్రూప్ నుంచి షేర్ చేసిన ఫోటోలను చూసి రాజమౌళి కూడా స్పందించారు.” సింధులోయ నాగరికత గురించి నాకు ఇంతకుముందే ఒక ఆలోచన వచ్చింది. కానీ పాకిస్తాన్ సహకరించకపోవడం వల్ల కుదరలేదని” రాజమౌళి బదులు ఇచ్చారు.

Indus Civilization: మనదేశంలో ఆనంద్ మహీంద్రా గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఔత్సాహికమైన పారిశ్రామికవేత్తో అందరికీ తెలుసు. సామాజిక మాధ్యమాల్లో కూడా చాలా చురుగ్గా ఉంటారు. తనకు నచ్చిన చిత్రాలను వెంటనే షేర్ చేస్తారు. తనను కదిలించిన సామాన్యుల జీవితాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. కొత్త కొత్త ఆవిష్కరణలు చేసే వారికి తనవంతు సహాయం చేస్తూ ఉంటారు. ఇక టాలీవుడ్ జక్కన్న రాజమౌళి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి ద్వారా తెలుగు సినిమాను పాన్ ఇండియా రేంజ్ లోకి తీసుకెళ్లారు. అంతేకాదు “ఆర్ ఆర్ ఆర్” లో “నాటు నాటు” పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డు సాధించారు. ఇలాంటి ఘనమైన నేపథ్యాలు ఉన్న ఈ దిగ్గజాలు ఇటీవల సింధులోయ నాగరికత గురించి మాట్లాడుకున్నారు. సింధు లోయ నాగరికతకు సంబంధించి ట్విట్టర్లో ఒక ఫోటోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు.. అంతేకాకుండా రాజమౌళిని ట్యాగ్ చేస్తూ సింధూలోయ నాగరికత నేపథ్యంలో మీరు ఎందుకు సినిమా తీయకూడదు? అంటూ ప్రశ్నించారు.
పాకిస్తాన్ ఒప్పుకోవడం లేదు
ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో “దేశీ థగ్” గ్రూప్ నుంచి షేర్ చేసిన ఫోటోలను చూసి రాజమౌళి కూడా స్పందించారు.” సింధులోయ నాగరికత గురించి నాకు ఇంతకుముందే ఒక ఆలోచన వచ్చింది. కానీ పాకిస్తాన్ సహకరించకపోవడం వల్ల కుదరలేదని” రాజమౌళి బదులు ఇచ్చారు. అయితే రాజమౌళి రామ్ చరణ్ తో మగధీర సినిమా తీస్తున్నప్పుడు దానికి సంబంధించిన షూటింగ్ “దోలవీర” లో చేశారు. అయితే షూటింగ్ జరుగుతున్నప్పుడు శిలాజంగా మారిన ఒక పురాతన చెట్టును రాజమౌళి చూశారు. సింధు లోయ నాగరికత ఎత్తు పల్లాల గురించి ఆ చెట్టు చెప్పిన కథను సినిమాగా తీయాలని ఆలోచన వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత రాజమౌళి పాకిస్తాన్ వెళ్లారు. పాకిస్తాన్లోని సింధులోయ నాగరికతకు ఆలవాలమైన మొహంజోదారో చూసేందుకు చాలా ప్రయత్నించారు. కానీ పాకిస్తాన్ దేశం నుంచి అనుమతులు రాలేదు.
ఆ దేశానికి వెళ్లారు
2018లో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనేందుకు రాజమౌళి ఆ దేశానికి వెళ్లారు. అయినప్పటికీ అక్కడ నెలవై ఉన్న మొహంజోదారాను చూసేందుకు రాజమౌళి ప్రయత్నించినప్పటికీ అనుమతులు లభించలేదు. ఆయన అప్పట్లో దీనిపై చాలా నిరాశ చెందారు. ఇక చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ప్రపంచంలో పురాతన నాగరికతల్లో సింధులోయ నాగరికత ఒకటి. సుమారు 5000 సంవత్సరాల కిందట సింధూ నది చుట్టుపక్కల అది మొదలైంది. క్రీస్తుపూర్వం 1700_ 2500 మధ్య సింధులోయ నాగరికత విలసిల్లింది. భారత ఉపఖండంలో పట్టణ సంస్కృతి సింధులోయ నాగరికతతోనే మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి గుజరాత్ లోని అరేబియా సముద్రం వరకు సింధులోయ నాగరికత విస్తరించి ఉంది. ఆ నాగరికతకు సంబంధించిన కొన్ని ప్రాంతాలు భారతదేశంలో, మరికొన్ని ప్రాంతాలు పాకిస్తాన్ లో ఉన్నాయి.

Indus Civilization
పాకిస్తాన్ లో హరప్పా
సింధులోయ నాగరికతకు ప్రధాన కేంద్ర బిందువు హరప్పా. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. అక్కడి పంజాబ్ రాష్ట్రంలోని రావీనది తీరంలో ఉండే ఈ నగరాన్ని రుగ్వేదంలో హరియు పియగా పేర్కొన్నారు. పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్ లో గల లర్ఖాన జిల్లాలో సింధూ నది కుడివైపు తీరంలో ఈ నగరం ఉంది. చరిత్రకారులు చెప్పిన ప్రకారం మొహంజోదారో అంటే శవాల దిబ్బ అని అర్థం. ఇక ఈ నాగరికతలో లోతాల్ అనే ప్రాంతం విశేషమైన ప్రాచుర్యం పొందింది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ జిల్లాలో ఈ ప్రాంతం ఉంది. సబర్మతి నది తీరంలో ఇది బయటపడింది. అంతేకాకుండా రాజస్థాన్ లోని హనుమాన్ నగర్ జిల్లాలో కాలీ బంగన్ అనే ప్రాంతం కూడా బయటపడింది. ఇది సరస్వతి నది తీరాన ఉంది. రాజమౌళి తీసిన మగధీర సినిమా షూటింగ్ ప్రాంతం దోలవీర గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉంది.
Delighted to hear this. Go for it! https://t.co/L2S413rJ48
— anand mahindra (@anandmahindra) April 30, 2023
