Chandrababu: చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారెంటీ ఎక్కడ?
టిడిపి ఆవిర్భావం తర్వాత ఎక్కువ కాలం ఆ పార్టీనే అధికారంలో ఉంది. సింహభాగం చంద్రబాబుదే. అటువంటి బాబు ఇప్పుడు పూర్ టూ రీచ్ అని నినాదిస్తూ పేదలను ధనవంతులు చేయడమే లక్ష్యమని నమ్మబల్కుతున్నారు.

Chandrababu: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైసిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కానీ దానిని ఒక ఫెయిల్యూర్ గా చూపించాలన్న కోణంలో ఎల్లో మీడియా శుల శోధన చేసింది. ఎక్కడైనా సమస్యలపై ప్రజలు ప్రశ్నిస్తే చాలు నిలదీతలంటూ పతాక శీర్షికన వార్తలను ప్రచురించింది. అయితే ఇప్పుడు అది టిడిపి నిర్వహించిన కార్యక్రమానికి వర్తించదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
మీ భవిష్యత్తుకు గ్యారెంటీ చంద్రబాబు పేరిట తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి 45 రోజులు పాటు రాష్ట్రంలోని ప్రతి ఇంటిని పలకరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కానీ కార్యక్రమం జరుగుతుందా? లేదా? అన్నట్టుంది. అసలు నిర్వహిస్తున్నారా లేదా కనీసం ఎల్లో మీడియాలో ప్రచురించడం లేదు. 14 సంవత్సరాలు రాష్ట్రానికి పాలించిన చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావాలన్నది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పటికే మినీ మేనిఫెస్టోను చంద్రబాబు ప్రకటించారు. దానికి ఇంటింటా ప్రచారం కల్పించాలని లక్ష్యం. కానీ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఇచ్చిన ప్రాధాన్యం కూడా.. భవిష్యత్తు గ్యారెంటీకి ఎల్లో మీడియా ఇచ్చిన దాఖలాలు లేవు.
టిడిపి ఆవిర్భావం తర్వాత ఎక్కువ కాలం ఆ పార్టీనే అధికారంలో ఉంది. సింహభాగం చంద్రబాబుదే. అటువంటి బాబు ఇప్పుడు పూర్ టూ రీచ్ అని నినాదిస్తూ పేదలను ధనవంతులు చేయడమే లక్ష్యమని నమ్మబల్కుతున్నారు. 2024లో అధికారం ఇస్తే ఐదేళ్లలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని గొప్పలు చెబుతున్నారు. మరి 14 ఏళ్ల పాలనలో ఏం చేసినట్టు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అప్పుడే పేదలకు ఎంతో కొంత సాయం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అన్న ప్రశ్న ఎదుర్కొంటున్నారు. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. మహిళా మహాశక్తి అంటూ కొత్త స్లోగన్ ఇచ్చారు. వైసీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలనే కాపీ కొట్టి ప్రచారం చేసేందుకు.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. కానీ ఇది పెద్దగా వర్కౌట్ అయినట్లు లేదు. ప్రజల నుంచి స్పందన వస్తే ఎల్లో మీడియాఒక రేంజ్ లో ప్రచారం చేసేది కదా. ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో ప్రాధాన్యత లేదంటే అదో ఫెయిల్యూర్ కార్యక్రమంగా తేలుతోంది.
