Madhuri Dixit : లోదుస్తుల్లో నటించమంటే మాధురి దీక్షిత్ అలా చేసింది… సలార్ యాక్టర్ సంచలన ఆరోపణలు!
మూడు దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. తన దర్శకత్వంలో తెరకెక్కాల్సిన అమితాబ్ మూవీ మాధురీ దీక్షిత్ కారణంగా ఆగిపోయిందని అన్నారు.

Madhuri Dixit : బాలీవుడ్ గ్లామర్ క్వీన్స్ లో మాధురీ దీక్షిత్ ఒకరు. శ్రీదేవికి సమకాలీనంగా హిందీ పరిశ్రమను షేక్ చేసింది. గొప్ప డాన్సర్, అందగత్తె, నటి అయిన మాధురీ దీక్షిత్ కి ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. ఆమెను ఆరాధిస్తారు. కాగా మాధురీ దీక్షిత్ ని ఉద్దేశిస్తూ నటుడు, దర్శకుడు టీనూ ఆనంద్ కీలక కామెంట్స్ చేశారు. మూడు దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. తన దర్శకత్వంలో తెరకెక్కాల్సిన అమితాబ్ మూవీ మాధురీ దీక్షిత్ కారణంగా ఆగిపోయిందని అన్నారు.
1989లో అమితాబ్ బచ్చన్-మాధురి దీక్షిత్ హీరోయిన్ గా ఓ మూవీ అనుకున్నారు. ఈ చిత్రానికి టీనూ ఆనంద్ దర్శకుడు. ఫస్ట్ షెడ్యూల్ లో ఐదు రోజుల షూటింగ్ జరిగిందట. ఓ సీక్వెన్స్ లో అమితాబ్ హీరోయిన్ మాధురి దీక్షిత్ ని విలన్స్ నుండి రక్షిస్తాడు. తనను కాపాడిన హీరోకి అన్ని విధాలా దగ్గర కావాలని హీరోయిన్ అనుకుంటుంది. ఈ క్రమంలో లోదుస్తుల్లో అతనితో సన్నిహితంగా ప్రవర్తిస్తుంది. ఈ సన్నివేశం చేయడానికి మాధురీ దీక్షిత్ ఒప్పుకోలేదట.
నేను లోదుస్తుల్లో నటించను అని మాధురి దీక్షిత్ అన్నారట. సినిమాకు సైన్ చేసేటప్పుడు మాధురి దీక్షిత్ అంగీకరించిందట. సెట్స్ లో మాత్రం చేయను అని మొండికేసిందట. దాంతో టీనూ ఆనంద్ ఆమెపై కోప్పడ్డారట. సెట్స్ నుండి వెళ్లిపొమ్మన్నాడట. దాంతో మాధురీ దీక్షిత్ రుసరుసలాడుతూ వెళ్లిపోయిందట. ఇక ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయిందట. ఈ విషయాన్ని తాజాగా ఆయన తెలియజేశారు.
ఇక టీనూ ఆనంద్ తెలుగులో కొన్ని చిత్రాలు చేశారు. ఆదిత్య 369 మూవీలో కాలంలో ప్రయాణించే యంత్రం చేసే శాస్త్రవేత్త రోల్ చేశాడు. ప్రభాస్ సాహో మూవీలో కూడా ఆయన కనిపించారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీలో టీనూ ఆనంద్ నటించడం విశేషం. సలార్ టీజర్ లో ప్రభాస్ క్యారెక్టర్ ని ఆయన పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంది. మూకీ సినిమా పుష్పక విమానంలో టీనూ ఆనంద్ కామెడీ కిల్లర్ రోల్ చేశారు.
