ఖాన్ త్రయానికి ముందే ట్రెండ్ సెట్ చేసిన డిస్కో డాన్సర్
ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలు100 కోట్ల క్లబ్‌లో చేరడం సాధారణ విషయంగా మారింది. అయితే తొలి వంద కోట్ల సినిమా రికార్డు ఎప్పుడూ మిథున్ చక్రవర్తి పేరు మీదనే నమోదవుతుంది.

ఇప్పుడు కాదు 40 ఏళ్ల ముందే వంద కోట్ల క్లబ్..
షోలే వసూళ్లను దాటేసిన మిథున్ చక్రవర్తి..
ఇప్పుడు ఇండియాలో ఒక సినిమా రిలీజైతే ఆ సినిమా ఎన్నిరోజుల్లో వంద కోట్లు సాధించిందనేది ప్రధానాంశంగా మారింది. మొన్నటి వరకు ఈ రేసులో బాలీవుడ్ లో ఖాన్ త్రయంతో పాటు అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గన్, రణ్వీర్ సింగ్ తదితర హీరోలు ఉండేవారు. కానీ బాహుబలి సిరీస్ తో సౌత్ సినిమాలు వంద కోట్ల క్లబ్బుల్లోకి సులువుగా చేరుతున్నాయి. అయితే ఈ వందకోట్ల క్లబ్ ను 1984లోనే చేరుకున్నాడు బాలీవుడ్ డిస్కో డాన్సర్ మిథున్ చక్రవర్తి.. స్టార్ హీరోల వందకోట్ల క్లబ్ ను ఎప్పుడో క్రియేట్ చేశాడు మిథున్.
ఇప్పుడు ఒక సినిమా రిలీజైతే ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, శాటిలైట్ రైట్స్ ఎంత.. ఓటీటీ బిజినెస్ ఎంత అనే లెక్కలు వేసే రోజులివి.
ఆ సినిమా ఎప్పుడు 100 కోట్ల ఎన్ని రోజుల్లో చేరింది.. 200, 300 కోట్లు ఎన్ని రోజుల్లో వచ్చాయి అనేదే ఇప్పుడు లెక్కలేస్తున్న రోజులు.
గజినీ కాదు.. అంతకు ముందే ట్రెండ్ బాలీవుడ్ లో తొలి వంద కోట్ల సినిమా అంటే మనకు గుర్తచ్చేది అమిర్ ఖాన్ గజినీ సినిమా. కానీ అంతకు ముందే రెండు బాలీవుడ్ సినిమాలు ఈ ట్రెండ్ కు నాంది పలికాయి. ముందుగా ఈ రికార్డ్ మిథున్ చక్రవర్తి పేరు మీద ఉంది. హీరో మిథున్ చక్రవర్తి 100 కోట్లు సాధించిన తొలి సినిమా.
ట్రెండ్ సెట్ చేసిన డిస్కో డాన్సర్
మిథున్ చక్రవర్తి కెరీర్‌కు కొత్త ఊపునిచ్చిన సినిమా డిస్కో డ్యాన్సర్. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అప్పట్లోనే రూ.6 కోట్లు రాబట్టింది. భారతదేశంలో 1982లో విడుదలైన ఈ చిత్రం 1984లో సోవియట్ యూనియన్‌లో విడుదలైంది. అక్కడ ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టి 100 కోట్ల గ్రాస్‌ను క్రాస్ చేసింది. సోవియట్ యూనియన్ తో పాటు ఆసియా, తూర్పు ఆఫ్రికా, టర్కీ, చైనాలో కూడా విడుదలై భారీ వసూళ్లను రాబట్టింది.
షోలే రికార్డూ బ్రేక్
ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.100 కోట్ల 68 లక్షలు వసూలు చేసింది. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. భారీ వసూళ్లతో ఈ సినిమా బిజినెస్ షోలే ను అధిగమనించింది. మిథున్ చక్రవర్తి జీవిత చరిత్రను రాసిన రచయిత రామ్ కమల్ ముఖర్జీ కూడా ‘ది దాదా ఆఫ్ బాలీవుడ్‘ పుస్తకంలో ఈ రికార్డును పొందుపరిచారు. ఈ సినిమా తర్వాత హమ్ ఆప్కే హై కౌన్ రూ. 135 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలు100 కోట్ల క్లబ్‌లో చేరడం సాధారణ విషయంగా మారింది. అయితే తొలి వంద కోట్ల సినిమా రికార్డు ఎప్పుడూ మిథున్ చక్రవర్తి పేరు మీదనే నమోదవుతుంది.
– అజయ్ యాదవ్
