WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్.. ఇక మీ చాట్ ను ఇలా లాక్ చేయొచ్చు..

వాట్సాప్ ను యూజ్ చేసే ప్రతి ఒక్కరు తమ చాట్ కు భద్రంగా ఉండాలని, ఇతరులు చూడొద్దని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు తమ మొబైల్స్ ను ఇతరులు తీసుకొని వాట్సాప్ ను ఓపెన్ చేసి చాట్ ను చూసేవాళ్లు.

  • Written By: SS
  • Published On:
WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్.. ఇక మీ చాట్ ను ఇలా లాక్ చేయొచ్చు..

Whatsapp: కమ్యూనికేషన్ వ్యవస్థలో కింగ్ మేకర్ గా మారింది వాట్సాప్. ఉద్యోగులు, వ్యాపారులతో సహా పెద్ద పెద్ద కంపెనీలు సైతం వాట్సాప్ ను ఉపయోగిస్తున్నాయి. కనీసం ఒక్కరోజైనా వాట్సాప్ ను ఉపయోగించని వారు దాదాపుగా లేరనే చెప్పవచ్చు. వాట్సాప్ లేకపోతే పనులు కూడా ముందుకు వెళ్లని పరిస్థితి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు అనుగుణంగా మెటా సంస్థ ఎప్పటి కప్పుడు యాప్ ను అప్డేట్ చేస్తోంది. కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చి సౌకర్యవంతంగా మారుస్తుంది. లేటేస్టుగా వాట్సాప్ కొత్త అప్డేట్ తో ఆకట్టుకుంటోంది. ఇన్నాళ్లు తాము ఇతరులతో చాట్ చేసిన మెసేజ్ లను ఇతరులు ఫోన్ తీసుకున్నప్పుడు ఓపెన్ చేసే ఆస్కారం ఉండేది. కానీ ఇప్పుడు అలా చేయడానికి వీల్లేదు. అదెలాగంటే?

వాట్సాప్ ను యూజ్ చేసే ప్రతి ఒక్కరు తమ చాట్ కు భద్రంగా ఉండాలని, ఇతరులు చూడొద్దని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు తమ మొబైల్స్ ను ఇతరులు తీసుకొని వాట్సాప్ ను ఓపెన్ చేసి చాట్ ను చూసేవాళ్లు. అయితే ఇకనుంచి మీ సంభాషణలు, మెసేజ్ లు ఇతరులు చూడకుండా లాక్ చేయొచ్చు. అంతేకాకుండా వాట్సాప్ లోని మెసేజ్ లు, వీడియోలు భద్రంగా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అందులో భద్రంగా ఉంచుకోవచ్చు. ఇలాంటి సేవలు అందించే ఆ ఫీచర్ కు ‘లాక్ చాట్’ అని పేరు పెట్టారు. మెటా సంస్థ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఈ ఫీచర్ ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇది ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

వాట్సాప్ ఉపయోగించే ప్రతీ ఒక్కరికి ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా ప్రైవేట్ చాట్ లకు లాక్ చేసుకోవచ్చు. ఒకసారి చాట్ లాక్ చేస్తే ఇతరులు ఎవరూ దీనిని ఓపెన్ చేయలేరు. ఒకవేళ ఎవరైనా ఫోన్ తీసుకొని లాక్ ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే ఆ చాట్ మొత్తాన్ని చెరిపేయాలని కోరుతుంది. అయితే మళ్లీ యూజర్ తన పాస్ వర్డ్ తో పాటు పింగర్ ప్రింట్స్ తో మాత్రమే ఆ చాట్ ను ఓపెన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది.

వాట్సాప్ లోని పైన ఉన్న మూడు చుక్కలను క్లిక్ చేస్తే ఈ ఫీచర్ కనిపిస్తుంది. గతంలో వాట్సాప్ లో వ్యక్తిగత చాట్ ఇతరుల మొబైల్స్ లో చూడకుండా ఎండ్ టు ఎండ్ అన్ క్రిప్ట్ అనే ఆప్షన్ ఉండేది. కానీ ఇప్పుడు యూజర్స్ ఫోన్ ఇతరులు తీసుకొని ఓపెన్ చేయడానికి ప్రయత్నించాలన్నా సాధ్యంకాని స్థితిలో ఫీచర్ ను తీసుకొచ్చింది. సో.. స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఈ ఫీచర్ తో ఎలాంటి లాభాలు పొందుతారో చూడాలి.

Read Today's Latest Technology News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు