Migration 2022: కూటికోసం కోటి విద్యలు అంటారు కదా.. ఆ జానెడు పొట్ట కోసం ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిమంది ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వలస వెళ్తున్నారు. కొందరు చదువు నిమిత్తం.. కొందరు ఉపాధి నిమిత్తం సొంత దేశాల నుంచి ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఉద్యోగులు వలస వెళ్తే దానిని మేథో వలస అంటారు . ఇలాంటి మేథో వలస ఎక్కువైతే ఆ దేశం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంది. ఎదిగే అవకాశాలను కోల్పోతుంది. ఇక ఈ వలసలు అనేవి ప్రపంచీకరణ తర్వాత పెరిగాయి. ఆర్థికంగా స్థిరపడిన దేశాలు.. అవకాశాల పేరుతో ఇతర దేశాల యువతను ఆకర్షించడం మొదలుపెట్టాయి. దీనివల్ల అభివృద్ధి చెందిన దేశాలు మరింత అభివృద్ధి చెందాసాగాయి. అభివృద్ధి చెందని దేశాలు విలువైన మానవ వనరులు కోల్పోయి అలాగే ఉండిపోయాయి. కోవిడ్ తర్వాత వలసలు తగ్గిపోయినప్పటికీ.. భారీ స్థాయిలో ఉద్యోగ సంక్షోభం వల్ల చాలామంది ఉపాధి కోల్పోయారు. వీరిలో మెజారిటీ ప్రజలు తమ స్వదేశాలకు తిరిగివచ్చారు. ఇప్పుడు ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్న నేపథ్యంలో.. మరింత మంది వారి వారి స్వదేశాలకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Migration 2022
అమెరికా టాప్
ఇతర దేశాల ప్రజలు చదువు కోసం, ఉపాధి కోసం ఎంచుకునే దేశాల్లో మొదటి వరుసలో ఉండేవి అమెరికా సంయుక్త రాష్ట్రాలు. అమెరికా దేశంలో సుమారు 51 లక్షల మంది ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఇది ఆ దేశ జనాభాలో ఇది15.28%. ఆ తర్వాత స్థానంలో జర్మనీ కొనసాగుతోంది.. దేశంలో 15.8 లక్షల ప్రజలు ఇతర దేశాల నుంచి వచ్చి నివసిస్తున్నారు. ఇది ఆ దేశ జనాభాలో 18.81 శాతం తో సమానం. ఇక సౌదీ అరేబియాలో 13.5 మిలియన్ల ప్రజలు ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడ వివిధ పనులు చేసుకుంటూ ఉన్నారు.. వలసవాదులు ఆ దేశ జనాభాలో 38.65% ఉంటారు. ఇక రష్యాలో 11.6 మిలియన్ల మంది ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడ ఉపాధి నిమిత్తం పనిచేస్తున్నారు.. రష్యా జనాభాలో బయటి నుంచి వచ్చిన వారి శాతం 7.97. ఇంగ్లాండ్ లో 9.4 మిలియన్ల ప్రజలు ఇతర దేశాల నుంచి వచ్చిన వారు నివసిస్తున్నారు.. వారి సంఖ్య ఆ దేశ జనాభాలో 13.79 శాతం.. యునైటెడ్ అరబ్ ఎమైరేట్స్ లో 8.7 మిలియన్ల ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వివిధ పనులు చేసుకుంటున్నారు.. ఆ దేశ జనాభాలో వారు 88.13% గా ఉన్నారు. ఫ్రాన్స్ దేశంలో 8.5 మిలియన్ల మంది ఇతర దేశాల నుంచి వచ్చి వివిధ పనులు చేసుకుంటున్నారు.. దేశ జనాభాలో వీరి శాతం 13.06. కెనడాలో 8.0 మిలియన్ల ప్రజలు ఉపాధి నిమిత్తం వచ్చి స్థిరపడ్డారు. దేశ జనాభాలో వీరు 21.33 శాతంగా ఉంటారు. ఇక ఆస్ట్రేలియాలో 7.7 మిలియన్ల ప్రజలు ఇతర దేశాల నుంచి వచ్చి వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు.. వారు ఆ దేశ జనాభాలో 30.14 శాతంగా ఉన్నారు. స్పెయిన్ లో 6.8 మిలియన్ ప్రజలు బయటివారే. వీరంతా వివిధ దేశాల నుంచి వచ్చి ఆ దేశంలో స్థిరపడ్డారు. ఆ దేశ జనాభాలో వారు 14.63 శాతంగా ఉన్నారు.
ఈ దేశం నుంచే వలసలు ఎక్కువ
2020 సంవత్సరం లెక్కలతో పోలిస్తే భారతదేశం నుంచి 17.9, మెక్సికో నుంచి 11.1, రష్యా నుంచి 10.8, చైనా నుంచి 10.5, సిరియా నుంచి 8.5, బంగ్లాదేశ్ నుంచి 7.4, పాకిస్తాన్ నుంచి 6.3, ఉక్రెయిన్ నుంచి 6.1, ఫిలిప్పీన్స్ నుంచి 6.1, ఆఫ్ఘనిస్తాన్ నుంచి 5.9 మిలియన్ల ప్రజలు ఉపాధి, ఉద్యోగం,చదువుల నిమిత్తం ఇతర దేశాలకు వలస వెళ్లారు.

Migration 2022
ఈ దేశాల నుంచి వలసలు తక్కువ
తువాలు నుంచి 239 మంది మాత్రమే ఇతర దేశాలకు వలస వెళ్లారు. ఆ దేశ జనాభాలో వీరు 2.3 శాతంతో సమానం.. నియూ దేశంలో 588 మంది ఇతర దేశాలకు వలస వెళ్లారు.. ఆ దేశ జనాభాలో వారి శాతం 33.79. వాటికన్ సిటీ నుంచి 809 మంది ఇతర దేశాలకు వలస వెళ్లారు. ఆ దేశ జనాభాలో వారి శాతం 100. సెయింట్ పైరీ అండ్ మిక్ లాన్ దేశంలో 998 మంది ఇతర దేశాలకు వలస వెళ్లారు. దేశ జనాభాలో వారు 17.2 శాతంతో సమానం. టాక్లా దేశంలో 1,238 మంది ఇతర దేశాలకు వలస వెళ్లారు. వారు ఆ దిశ జనాభాలో 91.23% తో సమానం. మాంట్ సెరాట్ దేశంలో 1,379 మంది ఇతర దేశాలకు వలస వెళ్లారు. ఆ దేశ జనాభాలో వారి శాతం 26.62. ఫాక్ ల్యాండ్ అనే దేశం నుంచి 1,957 మంది ఇతర దేశాలకు వలస వెళ్లారు. ఆ దేశ జనాభాలో వారు 56.25 శాతంతో సమానం. వాలిస్ అండ్ ఫూటునా దేశంలో 2,040 మంది ఇతర దేశాలకు వలస వెళ్లారు. ఆ దేశ జనాభాలో వారు 18.15 శాతంతో సమానం.. సా టేమ్ అండ్ ప్రిన్సిప్ అనే దేశంలో 2139 మంది ఇతర దేశాలకు వెళ్లిపోయారు. ఆ దేశ జనాభాలో వారు 0.98% తో సమానం. నౌరు అనే దేశంలో 2,201 మంది ఇతర దేశాలకు వెళ్లారు. వారు ఆ దేశ జనాభాలో 20.33 శాతంతో సమానం.