Astro Tips: నిద్ర నుంచి లేవగానే మంచి జరగాలంటే ఏం చూడాలి?

కొంత మంది లేవగానే ఉంగరాలు చూసుకుంటారు. ఇంకా కొందరు వారి ముఖాలను వారే చూసుకుంటారు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరైతే లేవగానే కాఫీ, టీలు తాగుతుంటారు. పళ్లు తోముకోకుండా తాగడం మంచిది కాదు. దంతాలను శుభ్రం చేసుకున్నాకే తాగితే బాగుంటుంది. కానీ ఎవరు వింటారు. బెడ్ కాఫీ అంటూ లొట్టలేసుకుని మరీ తాగుతున్నారు.

  • Written By: Srinivas
  • Published On:
Astro Tips: నిద్ర నుంచి లేవగానే మంచి జరగాలంటే ఏం చూడాలి?

Astro Tips: మనం ఉదయం నిద్ర లేవగానే ఏదో ఒక వస్తువును చూడటమో లేక మనుషులను చూడటమో చేస్తుంటాం. కానీ ఉదయం నిద్ర లేచిన వెంటనే చూసే వాటి ప్రభావంతోనే మనకు రోజు గడుస్తుంది. ఏదైనా కీడు జరిగితే ఇవాళ లేచి ఎవరి ముఖం చూశానో అని అనుకుంటారు. అంతటి తీవ్రత ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే భూదేవికి దండం పెట్టుకోవాలి. తరువాత మన అరచేతులను మన కళ్లకు అద్దుకుంటే మంచి జరుగుతుందని అంటారు.

పళ్లు తోముకోకుండా..

కొంత మంది లేవగానే ఉంగరాలు చూసుకుంటారు. ఇంకా కొందరు వారి ముఖాలను వారే చూసుకుంటారు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరైతే లేవగానే కాఫీ, టీలు తాగుతుంటారు. పళ్లు తోముకోకుండా తాగడం మంచిది కాదు. దంతాలను శుభ్రం చేసుకున్నాకే తాగితే బాగుంటుంది. కానీ ఎవరు వింటారు. బెడ్ కాఫీ అంటూ లొట్టలేసుకుని మరీ తాగుతున్నారు.

ముఖం కడుక్కోకుండా..

ముఖం కడుక్కోకుండా ఏది తినకూడదు. కానీ అన్ని తింటున్నారు. తాగుతున్నారు. స్త్రీలు ఉదయం నిద్ర లేవగానే వంటింట్లోకి వెళ్లకూడదు. ఎంగిలిపాత్రలు చూడకూడదు. ఉదయ నిద్ర లేచిన వెంటనే జంతువుల బొమ్మలు కూడా చూడకూడదు. నిద్ర లేచిన వెంటనే భూదేవికి నమస్కారం చేసుకోవాలి. మన పాపాలను క్షమించాలని వేడుకోవాలి. ఇలా చేస్తే మనకు మంచి జరుగుతుంది.

నిద్ర లేవగానే..

నిద్ర లేవగానే వేదమంత్రాలు చదువుతున్న బ్రాహ్మణుడిని చూడాలి. గోవు, తులసి మొక్కను చూడొచ్చు. గుడి గోపురం, పర్వతం, సముద్రం చూస్తే మంచి జరుగుతుంది. బంగారం, దూడతో ఉన్న ఆవును, ఎర్ర చందనాన్ని చూసినా చక్కటి ఫలితం ఉంటుంి. అగ్నిని చూసినా మంచి లాభాలే ఉంటాయి. ఇలా ఉదయంనిద్ర లేవగానే మనం చూసే వాటిని ఎంచుకోవాలి.

Read Today's Latest Health news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు