Minister Ambati Rambabu: మాది సంక్షేమ ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే. అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసిన మహోన్నతమైన సీఎం జగన్… ఇలా వ్యాఖ్యానాలు చేయమంటే రోజంతా చేసే అమాత్యులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి మాత్రం తెలియదు. పలానా పథకం ఎవరి కోసం? ఎప్పుడు అందిస్తారు? ఏ సమయంలో లబ్ధిదారుల ఖాతాలో వేస్తారు? అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు. అమ్మ ఒడి, రైతుభరోసా, విద్యాదీవెన, విద్యాకానుక, వసతి దీవెన, మత్స్యాకార భరోసా, ఆసరా..ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది. ఎప్పుడు ఏ పథకం అమలుచేస్తారో ఒక్క సంబంధిత మంత్రికి, ఆ శాఖ ఉన్నతాధికారులకే తెలుస్తోంది. ఆ రోజు సాక్షి పత్రిక చదివిన వారికి ఇంతో కొంత తెలుస్తుంది. కానీ పథకాల గురించి పక్క శాఖల మంత్రులకు తెలియదు. అధికారులుకు అంతకంటే తెలియదు. అయితే దీనికి మన మంత్రి అంబటి రాంబాబు ఏమీ అతీతులు కాదు. అసలు వైఎస్సార్ ఆసరా పథకం అంటే ఏంటమ్మా అని వలంటీర్లను అడిగి తెలుసుకునేదాక ఆయనకు తెలియలేదంటే పరిస్థతి అర్థం చేసుకోవచ్చు. ఇదేం మంత్రివర్యా అని అక్కడున్న వారు ముక్కున వేలేసుకున్నా, విపక్షాలు విమర్శలకు దిగినా రాష్ట్రంలో నవరత్నాలు పేరిట ఇబ్బడిముబ్బడిగా పథకాలు అమలుచేస్తుంటే.. ఎప్పుడ ఏ పథకం అందిస్తున్నారో తెలియని పరిస్థితి. అందుకే తాను మంత్రి అయినా ఏమాత్రం సంకోచించకుండా పథకం గురించి అడిగేశారు అంబటి. అయితే ఒక్క అంబటికే కాదు. కేబినెట్ లో ఉన్న చాలామంది కి పథకాల గురించి తెలియదు. కానీ నటిస్తుంటారు. కానీ మన అంబటికి మొహమాటం, బిడియం ఉండదు కనుక అందరి మధ్యలో అడిగేసి నవ్వులపాలయ్యరు.

Ambati Rambabu
Also Read: Allu Arjun Navadeep: బన్నీ సర్‌ప్రైజ్ : హీరో నవదీప్‌కు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్..
వలంటీర్ల వద్ద సమగ్ర సమాచారం..
వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న నవరత్నాల గురించి వైసీపీ ప్రజాప్రతినిధులు, అధికారులకు కూడా తెలియదు. కానీ గ్రామ, వార్డు వలంటీర్ల వద్ద మాత్రం సమగ్ర సమాచారం, వివరాలు ఉన్నాయి. డిప్యూటీ సీఎం, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర తన సొంత నియోజకవర్గం సాలూరులో గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటా ప్రచారంలో భాగంగా పథకాలు ఎవరిస్తున్నరమ్మా అని ఓ లబ్ధిదారుని అడిగితే.. ఇంకెవరు వలంటీర్లేనంటూ చెప్పడంతో ఆయన విస్తుబోయారు. ముఖ కవళికలు మార్చేశారు. పథకాలు ఇస్తున్నది వలంటీర్లు కాదమ్మా.. జగన్ ప్రభుత్వం అందిస్తోంది అని చెప్పారు. వలంటీర్లు కేవలం సమన్వయ బాధ్యతలు చూస్తారంటూ వివరించారు. అంబటి ఎపిసోడ్ లో కూడా ఇదే ఎదురైంది. పల్నాడు జిల్లాలో గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం కార్యక్రమానికి హాజరైన అంబటికి వైఎస్సార్ ఆసరా పథకం గురించి చెప్పేవారు కరువయ్యారు. కానీ ఆయన విడిగా వలంటీరును పిలిచి అడిగి అవగాహన పొందుంటే సరిపోయేది. కానీ ఓ లబ్ధిదారు తనకు ఆసరా అందలేని మంత్రికి విన్నవించడంతో ఆయన యాద్రుశ్చికంగా ఆసరా అంటే ఏంటని వలంటీరును అడిగి అడ్డంగా బుక్కయ్యారు. అటు మీడియా, ఇటు సోషల్ మీడియాకు దొరికిపోయారు. పాపం అంబటికి తెలియదు.. చాలా మంది ప్రజాప్రతినిధులు, అధికారులకు సైతం పథకాలు గురించి తెలియదని.. ఏంచేద్దాం అలా జరిగిపోయింది.
Also Read: NTR Acting: ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిపోయిన కళాతపస్వి !