Jagityala SI : జగిత్యాల ఎస్‌ఐ తప్పేంటి.. ఎందుకు మద్దతు పెరుగుతోంది..?
జగిత్యాల ఎస్‌ఐ అనిల్‌కుమార్ భార్య సిద్దిపేటకు వెళ్లేందుకు ఇద్దరు పిల్లలతో సహా బస్సులో కూర్చున్నారు. ఒకే సీటు మాత్రమే ఉండడంతో పక్కనే కూర్చున్న ముస్లిం మహిళను చోటు అడిగారు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది.

Jagityala SI : జగిత్యాల రూరల్ ఎస్‌ఐ అనిల్‌కుమార్ తనపై అకారణంగా దాడి చేశారంటూ ఓ మహిళ చేసిన ఆరోపణలపై పోలీసు ఉన్నతాధికారులు ఆతన్ని సస్పెండ్ చేశారు. ఆయన భార్యతో పాటు కానిస్టేబుల్‌పై కూడా కేసు నమోదు చేశారు. మరోవైపు అసలు అనిల్ చేసిన తప్పేంటని, ఆయన్ను అకారణంగా సస్పెండ్ చేశారంటూ కొన్ని సంఘాలు, పార్టీలు మద్దతు తెలుపుతూ ఆదివారం జగిత్యాల బంద్‌కు పిలుపునిచ్చాయి. అసలు తప్పెవరిది.. ఏమిటీ వివాదం.
జగిత్యాల ఎస్‌ఐ అనిల్‌కుమార్ భార్య సిద్దిపేటకు వెళ్లేందుకు ఇద్దరు పిల్లలతో సహా బస్సులో కూర్చున్నారు. ఒకే సీటు మాత్రమే ఉండడంతో పక్కనే కూర్చున్న ముస్లిం మహిళను చోటు అడిగారు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. భర్తకు ఫోన్ చేయడంతో హుటాహుటిన ఓ కానిస్టేబుల్ తో వచ్చిన ఎస్‌ఐ అనిల్‌కుమార్ తనను బస్సు నుండి దింపేయడంతో పాటు దాడి చేశారని, ఫోన్ లాక్కున్నారని ఫిర్యాదుదారు చెబుతోంది.
పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు అందడంతో ఎస్‌ఐని సస్పెండ్ చేయడంతో పాటు ఆయన భార్య, కానిస్టేబుల్‌పై కేసులు నమోదు చేశారు పోలీసులు. అయితే ఈ విషయంలో తమ తప్పేమీ లేదని ఎస్‌ఐ భార్య చెబుతున్నారు. చోటు ఇవ్వమని అడిగినందుకు తోటి మహిళ అకారణంగా తనను దూషించిందని, బస్సు దికాక నీ సంగతి చూస్తానని బెదిరించడంతో భయబడి తన భర్తకు ఫోన్ చేశానని చెబుతోంది ఎస్‌ఐ భార్య. తన భర్త కూడా దాడికి పాల్పడలేదని, అకారణంగా తమ కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తోంది.
ఇక ఇటూ ఎంఐఎం పార్టీ నాయకులు, అటు హిందూ సంఘాలు ఇరుపక్షాలకు మద్దతు తెలుపుతున్నాయి. ఎస్‌ఐ అనిల్‌పై చర్యలు తీసుకోవాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ జిల్లా ఎస్‌పిని కోరారు. ఎస్‌ఐ సస్పెన్షన్‌ను వెంటనే నిలిపివేయాలని బిజెపి రాష్ట్ర అధ్యకక్షులు బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనిల్‌కు మద్దతుగా ఆదివారం జగిత్యాల బంద్‌కు కూడా పలు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సంఘటనను రాద్ధాంతం చేయొద్దని, తనకు మద్దతు పలుకుతున్న వారితో తనకు సంబంధం లేదని మరోవైపు ఎస్‌ఐని సోషల్ మీడియాలో చెబుతున్నారు.
