NTR – Lakshmi Parvathi : ఎన్టీఆర్ మరణంలో నందమూరి ఫ్యామిలీ, లక్ష్మీపార్వతి పాత్ర ఎంత?

పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ వేలుపెట్టారు. రాజకీయ సిఫారసులు చేశారు. అయితే ఇంత జరుగుతున్నా ఎన్టీఆర్ కట్టడిచేయలేకపోయారు.పైగా వెనుకేసుకొచ్చారు

  • Written By: Dharma Raj
  • Published On:
NTR – Lakshmi Parvathi : ఎన్టీఆర్ మరణంలో నందమూరి ఫ్యామిలీ, లక్ష్మీపార్వతి పాత్ర ఎంత?

NTR – Lakshmi Parvathi : ఎన్టీఆర్ మరణం ఎవరి పాపం? ఇప్పటికీ అందరి తొలిచే ప్రశ్న ఇది. వెన్నుపోటు, అధికారాన్ని దూరం చేయడం, నాఅన్న వారు, సొంత కుటుంబసభ్యులు ఎదురుతిరగడంతోనే ఎన్టీఆర్ క్షోభకు గురయ్యారని.. ఆ బాధతోనే చనిపోయారని విశ్లేషిస్తుంటారు. ఇందులో వాస్తవాలు ఉన్నప్పటికీ స్వియ తప్పిదాలు కూడా ఎన్టీఆర్ మరణానికి ముమ్మాటికీ కారణం. ఎన్టీఆర్ కు అసలు సిసలైన సోలో రాజకీయ వారసుడిగా తానే కావాలన్న చంద్రబాబు తలంపు వీటన్నింటికీ కారణం. అందుకే ఇప్పటికీ ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణమని ఎక్కువ మంది వాదిస్తుంటారు. అయితే ఇలా బాధితుడిగా మారడం కూడా ఎన్టీఆర్ అసమర్థతే.

కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబును చేర్చుకోవడంపై అప్పట్లోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అది పార్టీతో పాటు ఎన్టీఆర్ కు చేటు తెస్తుందని ఒకరిద్దరు నాయకులు ఎన్టీఆర్ కు చెప్పారు. అయినా ఆయన పెడచెవినపెట్టారు. పోనీ లక్ష్మిపార్వతిని పెళ్లి చేసుకునే సమయంలో సైతం కుటుంబసభ్యులు వారించారు. ఇంతమంది సంతానం ఉండగా వద్దని వారించిన ఎన్టీఆర్ వినలేదు. మున్ముందు కుటుంబం నుంచి ఇబ్బందులు వస్తాయని సన్నిహితులు చెప్పినా ఆయన పెడచెవిన పెట్టారు. ఎన్టీఆర్ పతనానికి ఈ రెండు కారణాలే కారణమని ఇప్పటికీ విశ్లేషణలు ఉన్నాయి. ఒకటి చంద్రబాబును పార్టీలో చేర్చుకోవడ, రెండూ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవడం ముమ్మాటికీ తప్పిదాలే అన్నవారు అధికం.

ఎన్టీఆర్ వెన్నుపోటుకు ముందే పార్టీపై పట్టు కోల్పోయారు. అది ఆయనకు తెలియలేదు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి ఎంటరైన చంద్రబాబు పదవులను ఆశించలేదు. కేవలం పార్టీపైనే ఫోకస్ పెట్టారు. పార్టీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే అల్లుడిని చూసి ఎన్టీఆర్ ఆనందపడ్డారు. రాజకీయ శిక్షణ పేరుతో పార్టీలో ఉన్న అందరికీ చంద్రబాబు బాగా దగ్గరయ్యారు. అలాగే నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన సమయంలోనూ చంద్రబాబు ఎన్టీఆర్ తరఫున గట్టిగానే క్యాంపులు నిర్వహణ వంటివి దగ్గరుండి చూసుకున్నారు.వెంకయ్యనాయుడు, రామోజీరావు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఇతర ప్రజాస్వామ్య శక్తులు అన్నిటినీ ఎన్టీఆర్ కు అనుకూలంగా మార్చి మద్దతుగా కూడగట్టడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు.

ఏడు పదుల వయసులో ఎన్టీఆర్ పెళ్లాడారు అని తెలుసు. పదుల సంఖ్యలో కుటుంబసభ్యులు ఉన్నారని తెలుసు. ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశం వారికి ఇష్టం లేదు అని తెలుసు. పార్టీలో ఓ వర్గం వ్యతిరేకిస్తుంది అని తెలుసు. ఇటువంటి సమయంలో ఓర్పు, నేర్పుగా ఉండాల్సిన లక్ష్మీపార్వతి సైతం పరిధి దాటారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ వేలుపెట్టారు. రాజకీయ సిఫారసులు చేశారు. అయితే ఇంత జరుగుతున్నా ఎన్టీఆర్ కట్టడిచేయలేకపోయారు.పైగా వెనుకేసుకొచ్చారు. దీంతో ఎన్టీఆర్ రాజకీయ వారసత్వంపై ఆశలు పెట్టుకున్న చంద్రబాబుకు చేజేతులా అవకాశమిచ్చారు. ఇప్పుడు చేయిదాటితే కష్టం అన్న నందమూరి కుటుంబసభ్యులకు చంద్రబాబు ఇచ్చిన హెచ్చరిక అసలు యుద్ధం ప్రారంభమైంది. దీనికి రాజగురువు రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాక్రిష్ణల వ్యూహాలు తోడయ్యాయి. మొత్తానికైతే ఎన్టీఆర్ మరణంలో లక్ష్మీపార్వతి నుంచి కుటుంబసభ్యుల వరకూ అందరికీ పాత్ర ఉందన్న మాట.

సంబంధిత వార్తలు