Kantara Rishabh Shetty : వామ్మో..’కాంతారా’ హీరో రిషబ్ శెట్టి కొత్త సినిమాకి తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా?

Kantara Rishabh Shetty : బాక్స్ ఆఫీస్ వద్ద చిన్న సినిమాగా మొదలై ఆ తర్వాత KGF మరియు #RRR వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కలెక్షన్స్ ని దాటేసిన లేటెస్ట్ సంచలనం కాంతారా..రెండు కోట్ల రూపాయిల గ్రాస్ తో ప్రారంభమైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ జర్నీ 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్ల వరకు కొనసాగింది..ఒక చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషనల్ సృష్టించాలంటే భారి బడ్జెట్ అవసరం లేదు..కంటెంట్ ఉంటే చాలు […]

  • Written By: NARESH ENNAM
  • Published On:
Kantara Rishabh Shetty : వామ్మో..’కాంతారా’ హీరో రిషబ్ శెట్టి కొత్త సినిమాకి తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా?

Kantara Rishabh Shetty : బాక్స్ ఆఫీస్ వద్ద చిన్న సినిమాగా మొదలై ఆ తర్వాత KGF మరియు #RRR వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కలెక్షన్స్ ని దాటేసిన లేటెస్ట్ సంచలనం కాంతారా..రెండు కోట్ల రూపాయిల గ్రాస్ తో ప్రారంభమైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ జర్నీ 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్ల వరకు కొనసాగింది..ఒక చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషనల్ సృష్టించాలంటే భారి బడ్జెట్ అవసరం లేదు..కంటెంట్ ఉంటే చాలు అని ఎంతో మంది పాన్ ఇండియన్ బడా డైరెక్టర్స్ కి కనువిప్పు కలిగించిన సినిమా ఇది.

ఈ చిత్రానికి హీరో మరియు దర్శకుడిగా వ్యవహరించిన రిషబ్ శెట్టి కి వచ్చిన పేరు ప్రఖ్యాతలు మాములూవి కాదు..టాలీవుడ్ ,కోలీవుడ్ మరియు బాలీవుడ్ కి సంబంధించిన ఎందరో లెజెండ్స్ రిషబ్ శెట్టి ని ప్రశంసలతో ముంచెత్తారు..ముఖ్యంగా పతాక సన్నివేశాలలో ఆయన చూపించిన నట విశ్వరూపం మరో పదేళ్లు అయినా కూడా ఎవ్వరూ మర్చిపోలేరు.

అంత అద్భుతంగా నటించాడు కాబట్టే రిషబ్ శెట్టి కి నేడు పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ గా చలామణి అవుతున్న హీరోలతో సరిసమానమైన ఇమేజి దక్కింది..అంతకు ముందు రిషబ్ శెట్టి వెండితెర మీద ఒక్క సినిమాలో కూడా నటించలేదు..ఆయన కేవలం ఒక డైరెక్టర్ మాత్రమే..ఒక్కో సినిమాకి అప్పట్లో ఆయన పారితోషికం కేవలం నాలుగు కోట్ల రూపాయిలు మాత్రమే ఉండేది.

ఇప్పుడు ‘కాంతారా’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం తో ఆయన తన తదుపరి చిత్రం లో హీరోగా నటించడానికి 50 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నాడట..నాలుగు కోట్ల రూపాయిలు ఎక్కడ..50 కోట్ల రూపాయిలు ఎక్కడ..ఒక మనిషి ఇంత తొందరగా ఈ రేంజ్ కి ఎదగగలడా అని అందరూ ఆశ్చర్యపొయ్యే రేంజ్ కి రిషబ్ శెట్టి ఎదగడం నిజంగా ప్రశంసనీయం..భవిష్యత్తులో ఆయన కాంతారా లాంటి అద్భుతమైన దృశ్యకావ్యాలు ఇంకెన్ని తీస్తాడో చూడాలి.

Read Today's Latest Viral news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు