Bandla Ganesh – Pawan Kalyan : గబ్బర్ సింగ్ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లో ఒకటిగా ఉంది. ఈ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాత. ఆయనకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. పదేళ్ల క్రితమే రూ. 60 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ షేర్ ఈ మూవీ రాబట్టింది. నిర్మాతగా బండ్ల గణేష్ కి మూడో చిత్రం. పవన్ హీరోగా చేసిన తీస్ మార్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో పవన్ కళ్యాణ్ తన అభిమాని బండ్ల గణేష్ కి మరో ఛాన్స్ ఇచ్చారు. దర్శకుడు హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ తెరకెక్కించారు. పవన్ ఫ్యాన్స్ తోపాటు మూవీ లవర్స్ కి గొప్ప అనుభూతిని పంచేలా హరీష్ గబ్బర్ సింగ్ రూపొందించారు.
ముఖ్యంగా పవన్ మేనరిజం, వన్ లైనర్స్ ఆటం బాంబుల్లా పేలాయి. యాక్షన్ సన్నివేశాలు గూస్ బంప్స్ కలిగించాయి. దేవీశ్రీ సాంగ్స్, శృతి హాసన్ గ్లామర్ మూవీకి ప్లస్ అయ్యాయి. మొత్తంగా గబ్బర్ సింగ్ టాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. మరి అంతగా లాభాలు పొందిన బండ్ల గణేష్, చిత్ర హీరో పవన్ కళ్యాణ్ కి రెమ్యూనరేషన్ గా ఎంత ఇచ్చారో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. తాజాగా దీనికి సంబంధించిన చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు.
హోస్ట్ బాలయ్య… గబ్బర్ సింగ్ చిత్రానికి మీ రెమ్యూనరేషన్ ఎంత? అని అడిగారు. దానికి పవన్ ”నేను అనుకున్నంత ఇవ్వలేదు కాని తాను ఇవ్వాలనుకున్నంత ఇచ్చాడు” అని సమాధానం చెప్పారు. దీంతో సోషల్ మీడియాలో ఓ వాదన మొదలైంది. పవన్ కళ్యాణ్ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని బండ్ల గణేష్ అగ్రిమెంట్ చేసుకున్న మొత్తం కూడా ఇవ్వలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ మేరకు పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.
గబ్బర్ సింగ్ నాటికి పవన్ రెమ్యూనరేషన్ రూ. 25-30 కోట్లు వరకూ ఉంది. సో… ఆ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ చెల్లించకపోయి ఉండొచ్చు. ఇక ఎంత ఇచ్చాడు అనేది పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పలేదు. కాగా గబ్బర్ సింగ్ మూవీ ఫిబ్రవరి 11న రీరిలీజ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జల్సా, ఖుషి చిత్రాలను రీరిలీజ్ చేయగా రికార్డు కలెక్షన్స్ నమోదు చేశాయి. పవన్ చిత్రాలు నెలకొల్పిన రికార్డ్స్ దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. గబ్బర్ సింగ్ ఆ రెండు చిత్రాలకు మించిన ఆదరణ దక్కించుకుంటుందని అంచనా వేస్తున్నారు.