ODI World Cup 2023: కెప్టెన్ల పెళ్లి కి ఆయా దేశాల వరల్డ్ కప్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..?
2022వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్న పాట్ కమ్మిన్స్ 2023 లో ఆస్ట్రేలియా ని విశ్వ విజేతగా నిలిపాడు. ఇక దాంతో ఇప్పుడు కెప్టెన్ కి పెళ్ళైన తర్వాత సంవత్సరం వరల్డ్ కప్ ఆడితెనే ఆ సంవత్సరం లో ఆయా టీమ్ లకి వరల్డ్ కప్ సాధించి పెడుతున్నారు.

ODI World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇక దీనికి తోడుగా భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఇండియన్ టీమ్ బ్యాట్స్ మెన్స్ వరుసగా ఫెయిల్ అవ్వడంతో ఇండియా 240 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఇక దాంతో ఆస్ట్రేలియన్ టీం ప్లేయర్లలో హెడ్, లబుషణ్ ఇద్దరూ కలిసి చివరి వరకు పోరాడి ఆస్ట్రేలియా టీమ్ కి ఘన విజయాన్ని సాధించిపెట్టారు.
ఇక ఇందులో హెడ్ సెంచరీ చేసి తనదైన మార్క్ ఇన్నింగ్స్ తో ఆరోసారి ఆస్ట్రేలియాని విశ్వవిజేతగా నిలిపాడు. ఇక దాంతో ఆస్ట్రేలియా మంచి విజయం అందుకోవడంతో సోషల్ మీడియాలో ఒక సెంటిమెంట్ అనేది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అది ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ అయిన రికీ పాంటింగ్ 2002వ సంవత్సరంలో పెళ్లి చేసుకోగా, 2003 వ సంవత్సరంలో ఆస్ట్రేలియా కి వరల్డ్ కప్ సాధించి పెట్టాడు. అప్పుడు కూడా ఇండియన్ టీం మీదనే ఫైనల్ మ్యాచ్ ఆడిన ఆస్ట్రేలియా టీం ఇండియా పైన 125 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది…
2010 వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్న ఇండియన్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 2011 వ సంవత్సరంలో ఇండియాకి అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే వరల్డ్ కప్ ను సాధించి పెట్టాడు. శ్రీలంక మీద ఆడిన ఫైనల్ మ్యాచ్ ఇండియన్ టీం చేజింగ్ లో అద్భుతమైన ప్రదర్శనని కనబరిచి ఒక భారీ విక్టరీని సాధించి 2011 లో ఇండియాకి రెండోసారి వరల్డ్ కప్పును తీసుకొచ్చి పెట్టాడు…ఇక అలాగే 2018 వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్ అయిన ఈయన మోర్గాన్ 2019 వ సంవత్సరంలో జరిగిన ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ కి వరల్డ్ కల్ సాధించి చూపించాడు. ఇక క్రికెట్ కి పుట్టినిల్లుగా చెప్పుకునే ఇంగ్లాండ్ టీం కి 2019 కి ముందు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ రాకపోవడం విశేషం. ఇక మోర్గాన్ తన కెప్టెన్సీలో ఇంగ్లాండ్ ను విశ్వవిజేతగా నిలిపాడు…
2022వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్న పాట్ కమ్మిన్స్ 2023 లో ఆస్ట్రేలియా ని విశ్వ విజేతగా నిలిపాడు. ఇక దాంతో ఇప్పుడు కెప్టెన్ కి పెళ్ళైన తర్వాత సంవత్సరం వరల్డ్ కప్ ఆడితెనే ఆ సంవత్సరం లో ఆయా టీమ్ లకి వరల్డ్ కప్ సాధించి పెడుతున్నారు. ఇంకా దీంతో అయా కెప్టెన్లకి వచ్చిన వైఫ్ లక్కీ అవడంతో కప్పు అనేది ఆయా టీమ్ లా కెప్టెన్లు సాధించి పెడుతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఒక నమ్మకం అయితే విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక ఏది ఏమైనా ఇండియన్ టీం ఫైనల్ లో ఓడిపోవడం అనేది ఇప్పటికి ఇండియన్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు…
