RGV On Businessman Movie: ఆర్జీవీ కి బిజినెస్ మ్యాన్ మూవీ కి ఉన్న సంబంధం ఏంటి..?
పూరి జగన్నాథ్ తో మాట్లాడి ముంబైలో డాన్ ఎవడు లేడు ఇప్పుడు ఎవడైనా సరే ముంబై కి వెళ్లి డాన్ అయిపోవచ్చు అనే ఒక లైన్ చెప్పి దీనిమీద ఒక స్టోరీ రెడీ చేయమని చెప్పాడు అయితే ఈ సినిమాలో సూర్య హీరోగా చేస్తాడు నువ్వే డైరెక్షన్ చేయాల్సి ఉంటుంది అని కూడా చెప్పాడు.

RGV On Businessman Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లలో అప్పట్లో గొప్ప డైరెక్టర్ గా పేరుపొందిన ఒకే ఒక డైరెక్టర్ రాంగోపాల్ వర్మ… ఈయన తీసిన శివ సినిమాతో టోటల్ టాలీవుడ్ మొత్తం షేక్ అయింది.ఎందుకంటే అప్పటిదాకా ఒక మూస ధోరణిలో సాగిన తెలుగు సినిమా కథలన్నిటికీ చెక్ పెడుతూ ఈయన హాలీవుడ్ రేంజ్ లో తెలుగు సినిమాని తీర్చిదిద్దడం చూసిన తెలుగు సినిమా అభిమానులందరికీ ఆ టేకింగ్ విపరీతంగా నచ్చింది దాంతో రాంగోపాల్ వర్మ ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఇక అప్పటినుంచి వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక మంచి ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇక ఈయన రక్త చరిత్ర 2 సినిమా తీస్తున్నప్పుడు ఇందులో నటించిన సూర్య నటనకి బాగా ఇంప్రెస్ అయిన వర్మ ఆయనతో మరో సినిమా చేయాలని అనుకున్నాడు.
అందులో భాగంగానే పూరి జగన్నాథ్ తో మాట్లాడి ముంబైలో డాన్ ఎవడు లేడు ఇప్పుడు ఎవడైనా సరే ముంబై కి వెళ్లి డాన్ అయిపోవచ్చు అనే ఒక లైన్ చెప్పి దీనిమీద ఒక స్టోరీ రెడీ చేయమని చెప్పాడు అయితే ఈ సినిమాలో సూర్య హీరోగా చేస్తాడు నువ్వే డైరెక్షన్ చేయాల్సి ఉంటుంది అని కూడా చెప్పాడు.అలాగే ఈ సినిమా కి బిజినెస్ మ్యాన్ అనే పేరు ను కూడా తనే పెట్టాడు…ఇక దాంతో పూరి బ్యాంకాక్ వెళ్లి వారం రోజుల్లో బౌండడ్ స్క్రిప్ట్ తో ఇండియాకి తిరిగి వచ్చాడు. ఈ స్క్రిప్ట్ ని సూర్య కి చెప్తే అప్పటికే సూర్య సెవెంత్ సెన్స్ సినిమాలో లాక్ అయిపోయి ఉన్నాడు. ఈ సినిమా చేయడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పడంతో పూరి ఎక్కువ టైం తీసుకోవడానికి ఇష్టపడడు కాబట్టి డైరెక్ట్ గా ఆ స్క్రిప్ట్ ను మహేష్ బాబు కి చెప్పాడు. జస్ట్ లైన్ మాత్రమే విన్న మహేష్ బాబు మనం ఈ సినిమా చేస్తున్నామని పూరి జగన్నాథ్ కి చెప్పాడు. దాంతో బిజినెస్ మ్యాన్ సినిమా స్టార్ట్ అయింది. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం… ఈ సినిమా రిలీజ్ అయి తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది…
