Okkadu Vs Bhadra: భద్ర స్టోరీ కి ఒక్కడు మూవీ కి ఉన్న సంబంధం ఏంటి..?
ఇక ఈ సినిమా ఒక్కడు ఫ్లేవర్ రాకుండా బోయపాటి తన మేకింగ్ తో ఒక ఫ్రెష్ ఫీల్ తీసుకొచ్చాడు దాంతో ఈ సినిమా సక్సెస్ అయింది. రవితేజ కూడా ఈ సినిమాలో ప్రాణం పెట్టి నటించాడు దానివల్లే ఈ సినిమా ఇంకో మెట్టు పైకి ఎక్కిందనే చెప్పాలి.

Okkadu Vs Bhadra: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి కొద్దిమంది మంచి డైరెక్టర్లలో బోయపాటి శ్రీను ఒకరు. ఈయన తెలుగులో మాస్ డైరెక్టర్ గా చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఈయన చేసిన సినిమాల్లో మొదటి సినిమా అయిన భద్ర మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఆ తర్వాత డైరెక్టర్ గా ఆయనకి మంచి పేరు అయితే వచ్చింది. అయితే భద్ర సినిమా విషయంలో ఆయన ప్రొడ్యూసర్ దగ్గరికి స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ స్టోరీ విన్న కొంతమంది ప్రొడ్యూసర్లు ఈ స్టోరీ ఒక్కడు మూవీ స్టోరీ లా ఉంది అని ఆయనతో చెప్పారట…అయితే అప్పటికి ఒక్కడు సినిమా ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయింది దాంతో ప్రతి స్టోరీని దానికి రిలేటెడ్ గా బేస్ చేస్తూ చూసేవారు అలా భద్ర సినిమా స్టోరీ ని కూడా అలాగే చూసి ఈ స్టోరీ ఆల్మోస్ట్ అలానే ఉంది అని అనడంతో బోయపాటి శ్రీను ఆ స్టోరీని చాలా వరకు చేంజెస్ చేసినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగం గానే ఈ సినిమాలోకి ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని కూడా ఆడ్ చేసినట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమా ఒక్కడు ఫ్లేవర్ రాకుండా బోయపాటి తన మేకింగ్ తో ఒక ఫ్రెష్ ఫీల్ తీసుకొచ్చాడు దాంతో ఈ సినిమా సక్సెస్ అయింది. రవితేజ కూడా ఈ సినిమాలో ప్రాణం పెట్టి నటించాడు దానివల్లే ఈ సినిమా ఇంకో మెట్టు పైకి ఎక్కిందనే చెప్పాలి.ఏదేమైనప్పటికీ ఈ సినిమాలో క్లైమాక్స్ ఒక్కడు సినిమాని పోలినట్టే ఉంటుందని ఇప్పటికీ చాలామంది చెబుతూ ఉంటారు. అయితే ఈ సినిమా స్టోరీ మొదటగా బోయపాటి శ్రీను అల్లు అర్జున్ కి చెప్పారు. అయితే అప్పుడు అల్లు అర్జున్ కి ఉన్న ఇమేజ్ కి ఈ స్టోరీ చాలా పెద్దది అయిపోతుందని అనుకొని ఆయనే బోయపాటి గారిని దిల్ రాజు గారి దగ్గరికి పంపించాడు. దాంతో దిల్ రాజు ఈ స్టోరీ కి రవితేజని సెట్ చేశాడు. అలా ఇక ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్ళింది తొందర్లోనే షూటింగ్ పూర్తి చేసుకొని ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ బోయపాటి శ్రీను సినిమాల్లో భద్ర అనేది ఒక స్పెషల్ మూవీ అని చెప్పవచ్చు…
