Chandrababu Marriage: చంద్రబాబు పెళ్లిపత్రిక ఇలా ఉండడానికి కారణమేంటి?
అంతకుముందు తన పెళ్లికి ఆహ్వానించడానికి చంద్రబాబునాయుడు పెళ్లి పత్రికను ముద్రించాలరు. పసుపు కలర్లో ఉన్న ఈ కార్డుపై ఆకుపచ్చ కలర్లో అక్షరాలను ముద్రించారు.

Chandrababu Marriage: జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం పెళ్లి. ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకుంటాం. బంధువులు, స్నేహితులు, అతిరథుల మధ్య జరగాలని కోరుకుంటాం. ఇందుకోసం అందరినీ మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తారు. ఒకప్పుడు పెళ్లికి రావాలని ప్రత్యేకంగా ఒక మనిషి ద్వారా కబురు పంపేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తరువాత మొబైల్ లోనే సమాచారం ఇస్తున్నారు. ఇంతకంటే ముందు పెళ్లి కార్డుల ద్వారా పెళ్లికి ఆహ్వానించరేవారు. 1980 కాలంలో అప్పుడప్పుడే పెళ్లి కార్డులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో సీనియర్ ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరి, ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుల పెళ్లికార్డు గతంలో వైరల్ అయింది. అయితే దీనిపై తాజాగా ఓ విషయంలో రచ్చవుతోంది.
పెళ్లికి పిలిచేవారిని ఆకర్షించేందుకు రకరకాల పెల్లి పత్రికలను ముద్రిస్తాం. ఇవి సాధారణం నుంచి కాస్ట్లీ వరకు ఉంటాయి. కొందరు అతిథులను ఆకర్షించేందుకు పెళ్లి పత్రికలతో పాటు బహుమతులు కూడా పంపిస్తారు. ఇక 1980 కాలంలో కొందరు మాత్రమే పెళ్లి పత్రికలను ముద్రించుకునేవారు. 1981 సంవత్సరంలో సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తరుపున సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. ఈ సమయంలో చంద్రబాబునాయుడితో ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరికి పెళ్లి కుదిరింది. 1981 సెప్టెంబర్ 10న వీరికి పెళ్లయింది.
అంతకుముందు తన పెళ్లికి ఆహ్వానించడానికి చంద్రబాబునాయుడు పెళ్లి పత్రికను ముద్రించాలరు. పసుపు కలర్లో ఉన్న ఈ కార్డుపై ఆకుపచ్చ కలర్లో అక్షరాలను ముద్రించారు. అయితే ఇందులో ఆహ్వానము, చి..ల..సౌ భువనేశ్వరితో వివాహానికి తామెల్లరు రావాలని ప్రార్థన.. అని రాసి ఉంది. కింద రైట్ బాటమ్ లో చంద్రబాబునాయుడు పేరుమాత్రమే ఉంది. అయితే ఇప్పడున్న పెళ్లిపత్రికలో పెళ్లికి సంబంధించిన ముహూర్తం, తల్లిదండ్రుల పేర్లు, బంధువులు, అవసరమైతే ఇతర సమాచారం జోడిస్తున్నారు. కానీ ఇందులో అలాంటివేవీ లేదు.
ఎందుకిలా? అని కొందరు సోషల్ మీడియాలో చర్చలు పెట్టారు. అయితే ఆ కాలంలో ఇంకా పెళ్లి పత్రిలకు ఇప్పటి లాగా రాయాలి అని ఎవరూ అనుకోలేదు. పైగా కొత్తలో అవగాహన మేరకు మాత్రమే అలా ముద్రించారు. రాను రాను కాలంలో ఇవన్నీ జోడించారని కొందరు అంటున్నారు. అయితే గతేడాది కిందే చంద్రబాబునాయుడి పెళ్లి పత్రిక వైరల్ అయింది. ఇప్పుడు మరోసారి దీనిపై హాట్ హాట్ గా చర్చ సాగుతోంది.
