Pawan Kalyan – Kapu Community : పవన్ కళ్యాణ్ ఆలోచనల్లో హేతుబద్దత ఉందా?
కాపులు పవన్ కళ్యాణ్ ను తమ ఆకాంక్షలు తీర్చే నాయకుడిగా ఒప్పుకుంటున్నారు. అయితే పవన్ మాత్రం ముందుగా ఎక్కువ స్థానాలు తెచ్చుకొని బలపడాలని అంటున్నారు. అయితే కాపులు మాత్రం సీఎం పోస్ట్ కాపులకు దక్కాలని వారు కోరుకుంటున్నారు.

Pawan Kalyan – Kapu Community : పవన్ కళ్యాణ్ గత రెండు రోజులుగా ప్రజలతో పంచుకుంటున్న ఆలోచనల్లో హేతుబద్దత ఉందా? దాంతోపాటు పవన్ వ్యాఖ్యల దృష్ట్యా కాపు సామాజికవర్గం దారెటు? ఎందుకంటే ఈ సమస్య ఇప్పటిది కాదు..
మచిలీపట్నం ఆవిర్భావ సభలో కూడా ఇదే చర్చల మీద చర్చలు సాగుతున్నాయి. ఆంధ్ర రాజకీయాల్లో ఇప్పుడు పొత్తుల వ్యవహారమే కాకరేపుతోంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఇది నిజం. నిన్నా మొన్నా పొత్తులపై తన వైఖరిని స్పష్టంగా వెల్లడించాడు. కుండబద్దలు కొట్టాడు. పొత్తులు ఖచ్చితంగా ఉంటాయని చెప్పకనే చెప్పాలి.
పవన్ వ్యాఖ్యలతో ఇప్పుడు కాపులు డైలామాలో పడిపోయారు. దాదాపు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కాపులు అధికారంలోకి రాలేదు. వారి ఆవేదనలో అర్థం ఉంది. ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి చూస్తున్నారు. వాళ్లు వారి పొత్తులను వ్యతిరేకించడం లేదు. అలాగని అంగీకరించడం లేదు. కానీ కాపులకే సీఎం పోస్ట్ ఉండాలని కాపులకు ప్రాధాన్యత దక్కాలని కాపులు అనుకుంటున్నారు.
అయితే కాపులు పవన్ కళ్యాణ్ ను తమ ఆకాంక్షలు తీర్చే నాయకుడిగా ఒప్పుకుంటున్నారు. అయితే పవన్ మాత్రం ముందుగా ఎక్కువ స్థానాలు తెచ్చుకొని బలపడాలని అంటున్నారు. అయితే కాపులు మాత్రం సీఎం పోస్ట్ కాపులకు దక్కాలని వారు కోరుకుంటున్నారు. మేం ఎన్నాళ్లు ఎదురుచూడాలని.. నాయకత్వం అవసరమని అంటున్నారు. పవన్ పొత్తులు ఉంటాయని అంటున్నారు. కాపులు మాత్రం పొత్తులు సహేతుకం కాదని.. పవన్ సీఎం కావాలని చూస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ ఆలోచనల్లో హేతుబద్దత ఉందా? లేదా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
