Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఇప్పుడు గత కొంతకాలం నుండి పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఎందుకంటే ఈసారి జరగబోయే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఒంటరి గా పోటీ చేయాలని అధికార వైసీపీ పార్టీ చాలా బలంగా కోరుకుంటుంది. ఎందుకంటే జనసేన – టీడీపీ కలిస్తే ఈసారి తన ఓటమి తథ్యం అనే సంకేతాలు ఇప్పటికే జగన్ కి అర్థం అయిపోయింది.ప్రశాంత్ కిషోర్ చేయించిన సర్వే లో ఈ విషయం చాలా స్పష్టం గా తెలిసిపోయింది.
అందుకే టీడీపీ జనసేన కలిసి పోటీ చేయకూడదని, విడి విడిగా పోటీ చెయ్యాలని కోరుకుంటున్నారు.అయితే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, సభ చివర్లో ఆయన పొత్తుల గురించి కూడా క్లారిటీ ఇచ్చేసాడు.ఆయన ఇచ్చిన ఈ క్లారిటీ అధికార వైసీపీ పార్టీ కి ముచ్చమెటలు పట్టించేలా చేస్తున్నాయి.
ముందుగా ఒంటరిగా పోటీ చేయడం గురించి ఆయన మాట్లాడుతూ ‘త్వరలోనే యాత్ర ప్రారంభిస్తాము, రాష్ట్ర వ్యాప్తంగా మా బలం ఎలా పుంజుకుందో, ఓటు షేర్ ఎంత పెరిగిందో ఇలాంటివి అన్నీ సర్వే రిపోర్ట్స్ ద్వారా తెలుసుకొని, ఒంటరి గా పోటీ చేస్తాము’ అని చెప్పుకొచ్చాడు.
ఇంకా పొత్తుల గురించి పరోక్షంగానే స్పందించాడు పవన్ కళ్యాణ్.ఆయన మాట్లాడుతూ ‘వైసీపీ పార్టీ ఒకటి జరగకూడదని చాలా బలంగా కోరుకుంటుంది.కానీ అది కచ్చితంగా జరిగే తీరుతుంది.ఇన్నాళ్లు నాతో కలిసి నడిచిన ప్రతీ ఒక్క జనసేన నాయకుడు అసెంబ్లీ లో ఉండే విధంగా ప్రణాళికలను సిద్ధం చేశాను’ అంటూ చెప్పుకొచ్చాడు. దీనిపై ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి.ఈ ఎన్నికలలో నేను బలిపశువు కాబోనని, కచ్చితంగా జనసేన పార్టీ నాయకులందరూ అసెంబ్లీ లో ఉండేలా వ్యూహ రచన చేసాము అంటూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.
ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన రాజకీయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు