Oscar award : ప్రపంచం లో ఉన్న అన్నీ అవార్డ్స్ లో అత్యంత శ్రేష్ఠమైన అవార్డు ‘ఆస్కార్’ అనే విషయం అందరికీ తెలిసిందే.దిగ్గజ స్థాయిలో ఉన్న హీరోలు, డైరెక్టర్లు మరియు హీరోయిన్లు కూడా ఈ అవార్డు ని గెలుచుకోవడం అనేది ఒక డ్రీం గా చూస్తారు. 1929 వ సంవత్సరం లో డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్ మరియు విలయం డెమిలీ ఈ అవార్డ్స్ ని ప్రారంభించారు.ప్రపంచం లో ఉన్న సినిమా ఇండస్ట్రీ కి చెందిన నటీనటులు మరియు టెక్నిషియన్స్ ప్రతిభ ని గుర్తిస్తూ ఈ ఆస్కార్ అవార్డ్స్ ని అందజేస్తారు.
అలా కాలక్రమేణా ఈ అవార్డ్స్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.రేపు లాస్ ఏంజిల్స్ లో గత ఏడాది కి సంబంధించి సంచలన విజయాలుగా నమోదు చేసుకున్న సూపర్ హిట్ సినిమాలు, మరియు అందులో అద్భుతమైన ప్రతిభ ని కనబర్చిన వారికి రేపు అవార్డ్స్ ఇవ్వబోతున్నారు.ఈ నామినేషన్స్ లో మన #RRR సినిమాకి కూడా చోటు దక్కింది.రేపు ఆ అవార్డు ఈ సినిమా గెలుచుకుంటుందో లేదో చూడాలి.
ఈ సందర్భం గా ఈ అవార్డుకు సంబంధించిన కొన్ని కీలకమైన విశేషాలను ఇప్పుడు మేము మీ ముందు ఉంచబోతున్నాము.ఈ అవార్డు మొత్తం గోల్డ్ కలర్ తో మెరుస్తూ ఉండే విషయం తెలిసిందే.కానీ అది నిజమైన గోల్డ్ కాదు, కేవలం కోటింగ్ మాత్రమే.ఈ అవార్డు ని తయారు చెయ్యడానికి 400 డాలర్లు (32 వేల రూపాయిలు) ఖర్చు అవుతుంది.
కానీ దీనిని అమ్మితే వేల కోట్ల రూపాయిలు వస్తాయని అనుకునేరు,ఈ అవార్డు ని అమ్మితే వచ్చే వెల కేవలం ఒక్క డాలర్ మాత్రమే, ఇండియన్ కరెన్సీ లెక్కలో చూస్తే కేవలం 82 రూపాయిలు మాత్రమేనట.ఇది ఆస్కార్ అవార్డ్స్ కమిటీ పెట్టిన రూల్ అని తెలుస్తుంది.అసలు విషయానికి వస్తే గతం లో ఓర్సన్ విల్లీస్ అనే స్క్రీన్ ప్లే రైటర్ కి ఆస్కార్ అవార్డు రాగ, అతను కొంతకాలం తర్వాత ఆ అవార్డు ని వేలం వేసి 7.2 కోట్ల రూపాయలకు అమ్మాడు.ఈ విషయం తెలుసుకొని ఫైర్ అయిన ఆస్కార్ అవార్డ్స్ కమిటీ ఈ రూల్ ని ప్రవేశ పెట్టింది.