Train Mileage: ఒక రైలు మైలేజీ ఎంత? కిలోమీటరుకు ఎంత ఖర్చవుతుంది?
Train Mileage: ప్రపంచ రవాణా వ్యవస్థలో భారత్ రైల్వే అత్యంత పెద్దది, సగటున రోజుకు కోట్లాది మంది రైళ్లలోనే తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. అందుకే రవాణా వ్యవస్థలో ఎన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నా, సరికొత్త టెక్నాలజీ అందుబాటులో వచ్చినా రైలుకు ఉన్న ప్రాధాన్యత తగ్గలేదు. సామాన్యుడి నుంచి పెద్దతరగతి వరకూ అన్నివర్గాల వారికి రైలు సేవలందిస్తోంది. రోజురోజుకు తన పరిధిని విస్తరించుకుంటూ వస్తోంది. అయితే సామాన్యుడికి మాత్రం రైల్వే శాఖకు సంబంధించి చాలా వివరాలు తెలియవు. కనీస […]


Train Mileage
Train Mileage: ప్రపంచ రవాణా వ్యవస్థలో భారత్ రైల్వే అత్యంత పెద్దది, సగటున రోజుకు కోట్లాది మంది రైళ్లలోనే తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. అందుకే రవాణా వ్యవస్థలో ఎన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నా, సరికొత్త టెక్నాలజీ అందుబాటులో వచ్చినా రైలుకు ఉన్న ప్రాధాన్యత తగ్గలేదు. సామాన్యుడి నుంచి పెద్దతరగతి వరకూ అన్నివర్గాల వారికి రైలు సేవలందిస్తోంది. రోజురోజుకు తన పరిధిని విస్తరించుకుంటూ వస్తోంది. అయితే సామాన్యుడికి మాత్రం రైల్వే శాఖకు సంబంధించి చాలా వివరాలు తెలియవు. కనీస అవగాహన లేని వారు ఎంతో మంది ఉన్నారు. ప్లాట్ ఫారం బోర్డుపై సముద్ర మట్టానికి స్టేషన్ ఎంత ఎత్తులో ఉందని రాయడం వంటి విషయాలు గురించి అస్సలు తెలియదు. ఇక రైలు సగటు మైలేజీ ఎంత అన్నది కూడా తెలిసే చాన్స్ లేదు. కారు, బస్సు, ద్విచక్ర వాహనం.. ఇలా దేనిని తీసుకున్నా.. దాని మైలేజీ ఎంత? అని తెలుసుకునేందుకు ఆరాటపడతాం. కానీ వాటి మాదిరిగానే రైలుకు ఒక మైలేజీ ఉంటుంది కదా? అయితే ఎంత? అంటే మాత్రం చెప్పలేం. చివరకు కొంచెం అవగాహన ఉన్న పిల్లలు అడిగినా తెలియదన్న సమాధానమే వస్తుంది.
వాహనాల మాదిరిగా రైలు మైలేజీ కూడా చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. దానిని నిర్ధిష్ట మైలేజీ చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే రైలు మైలేజీ ప్యాసింజర్ రైలు, ఎక్స్ ప్రెస్ రైలు లేదా కోచ్ ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ మైలేజీ అనేది కోచ్ ల బట్టీ ఉంటుంది. తక్కువ కోచ్ లు ఉంటే ఆ ప్రభావం ఇంజన్ పై కూడా తగ్గుతుంది. దాని శక్తి పెరిగి మైలేజీ కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే రైలు మైలేజీని కిలోమీటర్లు కాకుండా గంటల్లోనే లెక్కించడం దీని స్పెషల్. 24,25 కోచ్ లు ఉన్న రైలుకు ఒక కిలోమీటరుకు ఆరు లీటర్ల డీజిల్ ఖర్చవుతుందని ఒక నివేదికలో చెప్పబడింది. ఆశ్చర్యకరంగా ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్ల కంటే ప్యాసింజర్ రైళ్లలోనే మైలేజీ తగ్గుతుందని రైల్వేశాఖ చెబుతోంది. డీజిల్ ఖర్చు కూడా చాలా అధికం.

Train Mileage
ప్యాసింజర్ రైలు ఒక కిలోమీటరు దూరం ప్రయాణించాలంటే 6 లీటర్ల డీజిల్ ఖర్చవుతోంది. అన్ని స్టేషన్లలో ఆగడమే ఇందుకు కారణం. అదే సమయంలో 12 కోచ్ లతో ఉన్న ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైలు కిలోమీటరు ప్రయాణించాలంటే కేవలం 4.5 లీటర్ల డీజిల్ ఉంటే సరిపోతుంది. రైలు మైలేజీ ఇంజన్ శక్తిపై ఆధారపడి ఉంటుంది. ఇందులో తరచూ బ్రేకింగ్, ఎత్తు ఎక్కడం, ఎక్కువ లోడ్ లాగడం తదితర అంశాలు ఎక్కువగా ప్రభావం చూపుతాయి. అయితే ప్రపంచ రైల్వే హిస్టరీలో ఇండియన్ రైల్వే ఖ్యాతి పెంచుకుంటూ వస్తోంది. అటు ప్రజాదరణ కూడా పెరుగుతోంది. అందుకే రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెంచింది.