Rohit Sharma: పెళ్లయ్యాక కూడా ఆ అమ్మాయితో ఇదేం పని రోహిత్ శర్మ?

Rohit Sharma: విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డే ఆడేందుకు వచ్చిన ఇండియా టీం కెప్టెన్ కు ఓ విచిత్రమైన సంఘటన విశాఖ విమానాశ్రయంలో ఎదురయింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఓ అభిమాని సరదా ప్రపోజల్ చేశాడు. ఎందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులతో ఎప్పుడూ సరదాగా ఉంటాడు. వారిపై ప్రేమను చూపిస్తాడు. ఎలాంటి ఘటనే వైజాగ్ లో చోటుచేసుకుంది. ఒక అభిమానికి హిట్ మాన్ […]

  • Written By: BS Naidu
  • Published On:
Rohit Sharma: పెళ్లయ్యాక కూడా ఆ అమ్మాయితో ఇదేం పని రోహిత్ శర్మ?

Rohit Sharma: విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డే ఆడేందుకు వచ్చిన ఇండియా టీం కెప్టెన్ కు ఓ విచిత్రమైన సంఘటన విశాఖ విమానాశ్రయంలో ఎదురయింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఓ అభిమాని సరదా ప్రపోజల్ చేశాడు. ఎందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులతో ఎప్పుడూ సరదాగా ఉంటాడు. వారిపై ప్రేమను చూపిస్తాడు. ఎలాంటి ఘటనే వైజాగ్ లో చోటుచేసుకుంది. ఒక అభిమానికి హిట్ మాన్ సరదాగా ప్రేమ ప్రతిపాదన చేశాడు. పువ్వు ఇచ్చి మరి పెళ్లి చేసుకుంటావా..? అని అడిగాడు అసలేం జరిగిందో ఒకసారి చూద్దాం.

ఆస్ట్రేలియా సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో వ్యక్తిగత కారణాలతో అందుబాటులో లేని రోహిత్ శర్మ రెండో వన్డే కు జట్టుతో చేరాడు. సభ్యులతో కలిసి వైజాగ్ విమానాశ్రయంలో దిగాడు. ఆటగాళ్లంతా బయటకు వస్తుండగా ఓ అభిమాని వారిని ఫాలో అవుతూ.. ఫోన్లో సెల్ఫీ వీడియో తీశాడు. ఇంతలో అతడు వద్దకు వచ్చిన రోహిత్ శర్మ.. తన వద్ద ఉన్న గులాబీని ఇచ్చాడు. గులాబీ ఇవ్వడంతో పాటు రోహిత్ శర్మ చెప్పిన ఓ మాట ఆ అభిమానతో పాటు అక్కడ ఉన్న వారిని కూడా షాక్ కు గురి చేసింది.

పువ్వు తీసుకో.. పెళ్లి చేసుకో..

క్రికెట్ ప్లేయర్స్ వస్తున్నారని తెలుసుకున్న విశాఖలో అభిమానులు పెద్ద ఎత్తున ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ప్లేయర్స్ ను పలువురు అభిమానులు వీడియోలు, సెల్ఫీలు తీస్తున్నారు. ఈ సందర్భంగా ఓ అభిమాని సెల్ఫీ వీడియో తీస్తుండగా.. రోహిత్ శర్మ సహచర క్రికెటర్లతో కలిపి అభిమాని వద్దకు వచ్చాడు. అప్పటికే తన చేతిలో ఉన్న ఓ పువ్వును సదరు అభిమానికి ఇచ్చి ఓ ప్రతిపాదన అతని ముందు పెట్టి ముందుకు సాగాడు. నిన్న ఆ అభిమాని షాక్ తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. పువ్వు ఇచ్చిన తర్వాత రోహిత్ శర్మ ఏమన్నాడంటే.. ‘తీసుకో ఇది నీకోసమే నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని సరదాగా అడిగాడు. రోహిత్ తనను పలకరించినందుకు సంతోషించిన ఆ అభిమాని.. ప్రపోజల్ కు మాత్రం కాస్త షాక్ అయినట్లు కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఇకపోతే విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ 10 వికెట్లు తేడాతో ఘోర పరాభవాన్ని మూట గట్టుకున్న విషయం తెలిసిందే.

Rohit Sharma

Rohit Sharma

అభిమానులతో సరదాగా ఉండే రోహిత్ శర్మ..

రోహిత్ శర్మ తన అభిమానులతో ఎప్పుడు సరదాగా ఉంటాడు. పి కోసం ఎవరైనా వస్తే కాదనకుండా దగ్గరకు తీసుకొని వారికి సెల్ఫీ ఇచ్చి పంపిస్తుంటాడు. అప్పుడప్పుడు అభిమానులతో సరదాగా మాట్లాడుతూ కనిపిస్తుంటాడు. అందుకే రోహిత్ శర్మ అంటే అభిమానులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తాజాగా విశాఖ ఎయిర్పోర్టులో అభిమానికి ఎదురైన ఫన్నీ ఇన్సిడెంట్ రోహిత్ అబిమానులతో వ్యవహరించే అద్దం పడుతోందని పలువురు క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు.

Tags

    follow us