Rohini Karthi 2023: రోహిణి కార్తె అంటే ఏంటీ? విశిష్టతేంటి? ఎండలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి ?

రోహిణి కార్తెలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. వడగాలుల ప్రభావం ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీంతో మట్టికుండలో నీళ్లు తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. ఫ్రిజ్ వాటర్ తాగడం మంచిది కాదు. ఈ నేపథ్యంలో మే 25 నుంచి జూన్ 8 వరకు ఉండే ఈ కాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండటమే మంచిది.

  • Written By: Shankar
  • Published On:
Rohini Karthi 2023: రోహిణి కార్తె అంటే ఏంటీ? విశిష్టతేంటి? ఎండలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి ?

Rohini Karthi 2023: రేపు రోహిణి కార్తె ఆగమనం. దీంతో ఏరువాక ప్రారంభం అవుతుంది. వానలు సరైన సమయంలో పడితే రోహిణిలోనే వ్యవసాయ పనులు ప్రారంభం అవుతాయి. దీంతో రైతులు పంటలు సాగు చేసేందుకు ముందుకు వస్తారు. రోహిణిలో ఎండలు మెండు అంటారు. రోహిణిలో రోకండ్లు పగిలే ఎండలు కాస్తాయని చెబుతుంటారు. ఇలా ఈ కార్తెతో ఎండాకాలం అంతమైపోతుంది. రోహిణి కార్తె తో వ్యవసాయ కాలం ఆరంభం అవుతుంది. దీని తరువాత ఒక్కో కార్తె వస్తూ ఉంటాయి. ఇలా మన వ్యవసాయ పనుల కోసం ఒక్కో కార్తెలో ఒక్కో రకమైన పనులు చేస్తుంటారు.

ఎండల తీవ్రత

రోహిణి కార్తెలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. వడగాలుల ప్రభావం ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీంతో మట్టికుండలో నీళ్లు తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. ఫ్రిజ్ వాటర్ తాగడం మంచిది కాదు. ఈ నేపథ్యంలో మే 25 నుంచి జూన్ 8 వరకు ఉండే ఈ కాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండటమే మంచిది.

ఏం తీసుకోవాలి

కొబ్బరిబొండాలు, మజ్జిగ, పళ్ల రసాలు, నిమ్మరసం, రాగిజావ వంటి వాటిని తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది. పచ్చళ్లు, కారం, వేపుళ్లు వంటి వాటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. మసాలాలు వాడకపోవడమే మంచిది. ఇలా రోహిణి కార్తెలో ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే ఇబ్బందులు వస్తాయి. ఈ క్రమంలో రోహిణిలో ఎండకు తిరగకపోవడమే బెటర్.

ఏం ధరించాలి

ముదురు రంగు దుస్తులు కాకుండా లైటు కలర్ వాటిని ఎంచుకోవాలి. కాటన్ దుస్తులను వాడితే మంచిది. అందులో తెల్ల రంగులో ఉన్నవాటిని తీసుకుంటే ప్రయోజనం. సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు వస్తాయి. దీన్ని గుర్తించి మన దుస్తుల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలి. ముదురు రంగు దుస్తులను కాకుండా తెల్లరంగు వాటిని వేసుకోవడం ఉత్తమం.

జంతువులకు సైతం

రోహిణి కార్తెలో జంతువులను సైతం జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాటిని నీళ్లు ఉండే ప్రాంతాల్లోనే ఉంచాలి. దీంతో వేడి నుంచి వాటికి కూడా ఉపశమనం లభిస్తుంది. వేసవిలో జంతువులు తాగునీటి కోసం ఎంతో ఆరాటపడుతుంటాయి. నీళ్లు దొరకకపోతే ఇబ్బందులు పడతాయి. అందుకే వాటిని కూడా మంచిగా చూసుకుని వాటి ప్రాణాలకు ముప్పు లేకుండా ముందుచూపుతో వ్యవహరించాలి.

సంబంధిత వార్తలు