Kamika Ekadashi 2023: కామిక ఏకాదశి అంటే ఏమిటి? దాని విశిష్టత ఏమిటో తెలుసా?
కామిక ఏకాదశికి మన హిందూ ధర్మంలో మంచి స్థానం ఉంది. హిందూ మతం ప్రకారం శ్రావణ మాసలో వచ్చే కృష్ణ పక్షంలో పదకొండో రోజును కామిక ఏకాదశి అంటారు. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. విష్ణువును పూజించి ఉపవాస దీక్ష ఆచరిస్తే జీవితంలో సమస్యలు రాకుండా ఉంటాయని చెబుతుంటారు. అంతే కాదు పాపాలు పోతాయని కూడా నమ్ముతారు.

Kamika Ekadashi 2023: మనకు ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. అందులో శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన కామిక ఏకాదశి జులై 13న జరుపుకుంటాం. జులై 12న సాయంత్రం 6.01 గంటల నుంచి 13 వరకు కామిక ఏకాదశి అని పిలుచుకుంటాం. జులై 13 సాయంత్రం 6.26 గంటలకు కామిక ఏకాదశి ముగుస్తుంది. కామిక ఏకాదశి అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది అనే విషయాలపై చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి.
దీని విశిష్టత ఏమిటి?
కామిక ఏకాదశికి మన హిందూ ధర్మంలో మంచి స్థానం ఉంది. హిందూ మతం ప్రకారం శ్రావణ మాసలో వచ్చే కృష్ణ పక్షంలో పదకొండో రోజును కామిక ఏకాదశి అంటారు. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. విష్ణువును పూజించి ఉపవాస దీక్ష ఆచరిస్తే జీవితంలో సమస్యలు రాకుండా ఉంటాయని చెబుతుంటారు. అంతే కాదు పాపాలు పోతాయని కూడా నమ్ముతారు.
విష్ణువును పూజిస్తే..
కామిక ఏకాదశి రోజు విష్ణువును విశేషంగా పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కామిక ఏకాదశి కథను శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పినట్లు ప్రతీతి. ఈ రోజు ఉదయాన్నే నిద్ర లేవాలి. తలస్నానం చేసి ఉపవాస దీక్షను ఆచరించాలి. గంగాజలంతో శుద్ధి చేసుకుని విష్ణువుకు అభిషేకం చేయాలి. అరటిపండ్లు, మామిడి పండ్లు, పంచామృతాలు సమర్పిస్తే మంచిది.
తులసి ఆకులతో..
తులసి ఆకులతో, పచ్చని పూలతో కామిక ఏకాదశి రోజు కృష్ణుడిని పూజించాలి. ఏకాదశి కథ చదవాలి. ఒక రోజు ఉపవాసం చేసి దేవుడి స్మరణతో భగవంతుడిని ధ్యానం చేయడం వల్ల ఏకాదశి పుణ్యం వస్తుంది. మరుసటి రోజు బ్రాహ్మడికి భోజనం సిద్ధం చేసి పెట్టి దక్షిణ సమర్పించి ఆపై పరణ ముహూర్తం సమయంలో ఉపవాస దీక్ష విరమించి భోజనం చేయాలి.