Modi Pushpa Dance: కరోనా కాస్త తగ్గగానే ఆగమాగంలో విడుదలైన ‘పుష్ఫ’ మూవీ తన సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. తెలుగుతోపాటు హిందీ, దక్షిణాది భాషల్లో రూపొందిన ఈ మూవీ ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్ గా మిగింది. ప్రధానంగా ‘శ్రీవల్లి’ పాట హిందీ ఆడియెన్స్ ను ఊపేస్తోంది. ఆ పాటను భారతీయ క్రికెటర్లు సూర్యకుమార్, ఇషాన్ కిషన్ సైతం చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Modi Pushpa Dance
ఇప్పుడు ప్రముఖ కొరియన్ పాప్ సింగింగ్ బ్యాండ్ బీటీఎస్ చేసిన ‘బాయ్ విత్ లవ్’ వీడియోకు పుష్పలోని ‘ఊ అంటావా మావ’ పాటను జత చేస్తూ ఓ నెటిజన్ స్పెషల్ వీడియోను క్రియేట్ చేశాడు అది ఇప్పుడు వైరల్ అయ్యింది.
https://www.instagram.com/tv/CY9G4usqc4X/?utm_source=ig_web_copy_link
ఇక ప్రధాని మోడీని కూడా నెటిజన్లు వదల్లేదు. మోడీ పుష్ప గా మారి ‘శ్రీవల్లి’లాగా డ్యాన్స్ చేస్తే ఎలాగుంటుందో అచ్చం అలాగే ఒక కార్టూన్ ను సృష్టించి వదిలారు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏకంగా మోడీ ‘శ్రీవల్లి’ పాటకు స్టెప్పులేసిన కార్టూన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీన్ని తెగ షేర్ చేస్తూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మీరూ కింద చూసి ఆ వీడియోను ఎంజాయ్ చేయండి.
My favourite WhatsApp forward! The creators in our country don’t sleep 😂
Looking great Modiji! @narendramodi @alluarjun #Pushpa pic.twitter.com/QBkxX51b3a
— Akshat Saraf 🇮🇳 (@AkshatSaraf) January 21, 2022