Sleep : ఒక రోజు నిద్ర లేకపోతే ఏమవుతుందో తెలుసా?

Sleep : మనిషికి కావాల్సినవి రెండే రెండు. ఒకటి మంచి నిద్ర. రెండు సుఖమైన నిద్ర. కడుపు నిండా తిండి కన్నారా నిద్ర ఉంటే ఆరోగ్యం ఉంటుంది. దీంతో పదికాలాల పాటు చల్లగా జీవించొచ్చు. ఆరోగ్యం సహకరించకపోతే సరైన తిండి ఉండదు. సుఖమైన నిద్ర పట్టదు. దీనికి కూడా మనం చేసే పొరపాట్లే. సరైన ఆహారం తీసుకోకపోతే ఇబ్బందులొస్తాయి. సరైన నిద్ర పోవాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్యలే వస్తాయి. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాలు […]

  • Written By: Srinivas
  • Published On:
Sleep : ఒక రోజు నిద్ర లేకపోతే ఏమవుతుందో తెలుసా?

Sleep : మనిషికి కావాల్సినవి రెండే రెండు. ఒకటి మంచి నిద్ర. రెండు సుఖమైన నిద్ర. కడుపు నిండా తిండి కన్నారా నిద్ర ఉంటే ఆరోగ్యం ఉంటుంది. దీంతో పదికాలాల పాటు చల్లగా జీవించొచ్చు. ఆరోగ్యం సహకరించకపోతే సరైన తిండి ఉండదు. సుఖమైన నిద్ర పట్టదు. దీనికి కూడా మనం చేసే పొరపాట్లే. సరైన ఆహారం తీసుకోకపోతే ఇబ్బందులొస్తాయి. సరైన నిద్ర పోవాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్యలే వస్తాయి. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాలు వింటే మనకు ఆశ్చర్యం కలగక మానదు. కొంత మందికి ఇట్టే నిద్ర పడుతుంది. మరికొంత మంది నిద్ర కోసం తపిస్తారు. ఎంతకీ నిద్ర పట్టదని వాపోతుంటారు. దానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటిని మనం పాటిస్తే సరిపోతుంది.

ఒక రోజు..

ఒక రోజు నిద్రకు దూరమైతే 1-2 సంవత్సరాలు మన వయసు పెరిగినట్లు మన మెదడు సూచిస్తుందట. అంటే ఒక రోజు నిద్ర పోకపోవడం వల్ల సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అందుకే నిద్రను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. రాత్రి వేళ బాగా నిద్ర పోయేందుకే సమయం కేటాయించుకోవాలి. అప్పుడే మనకు ఆరోగ్యం మెరుగవుతుంది. ఒక రోజు నిద్ర లేకపోతే ఏమవుతుందనే దానిపై శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

తేలిన విషయం

ఈ పరిశోధనలో బయటపడిన మరో విషయం ఏంటంటే నిద్ర లేనప్పుడు మెదడుల వచ్చిన మార్పులు, మళ్లీ గాఢమై నిద్ర పోతే యథావిధిగా మారతాయని తేలింది. ఒక రోజు మనం నిద్ర పోకపోతే వచ్చిన మార్పులు తరువాత రోజు తొలగిపోతాయని వెల్లడైంది. మెదడు తిరిగి సాధారణ స్థితికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా మన శారీరక వ్యవస్థ రూపొందించబడింది. అందుకే ప్రకృతి సిద్ధంగా నిర్మాణం జరిగిన మన శరీరం అవస్థల పాలు కాకూడదనుకుంటే మంచి నిద్ర పోయేందుకే ప్రయత్నించాలి.

తక్కువ నిద్రతో..

రోజుకు మూడు, ఐదు, ఎనిమిది గంటలు నిద్రపోతే మెదడులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోలేదు. అంతకంటే తక్కువ నిద్ర పోతేనే దుష్ఫలతాలు వస్తాయని చెబుతున్నారు. ఎన్ని గంటలు నిద్ర పోవాలనే దాని మీద స్పష్టమైన ఆధారమేదీ ఇవ్వలేదు. నిద్ర పోవాలని చెప్పిందే కానీ ఎంత సమయం తీసుకోవాలనే దాని మీద ఎలాంటి క్లారిటీ లేకపోవడం గమనార్హం. దీంతో మనం రోజుకు కచ్చితంగా 8 గంటలు నిద్ర పోవాల్సిందేనని పలు సందర్భాల్లో గుర్తు చేస్తుంటాం.

134 మందితో..

పరిశోధనలో మొత్తం 134 మంది పాల్గొన్నారు. 42 మంది మహిళలు, 92 మంది పురుషులు. వయసు 19-39 ఏళ్ల మధ్య ఉంటుంది. వీరిని ఐదు బ్యాచులుగా చేసి ఒక రోజు మొత్తం నిద్ర పోకపోతే ఎలా ఉంటుంది? రోజులో 3 గంటలు, 5 గంటలు, 8 గంటలు పడుకున్నప్పుడు పరిశోధన నిర్వహించారు. సరైన నిద్ర లేకపోతే మనిషి కుంచించుకుపోతాడు. ఆరోగ్యం దెబ్బతిని పలు శారీరక మార్పులు చోటుచేసుకుంటాయి. అనారోగ్యాలు దరిచేరతాయి. కొత్త వ్యాధులు చుట్టుముడతాయి. అందుకే మంచి నిద్ర పోయేందుకు అనువైన పరిస్థితులను ఏర్పాటు చేసుకోవడం సురక్షితం.

Read Today's Latest Health news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు