
Spoiled Coconut
Spoiled Coconut: హిందువులకు అత్యంత పవిత్రమైనది కొబ్బరికాయ. దేవుడి ముందు దీన్ని కొట్టి కోరికలు కోరుకోవడ సహజం. మన సంస్కృతిలో కొబ్బరికాయ కొట్టే ఆచారం ఉంది. కొబ్బరికాయను టెంకాయ అని కూడా పిలుస్తుంటారు. ఇంకా నారికేళం అనే పేరుతో కూడా సంబోధిస్తారు. భగవంతుడికి పూజ, ఇంట్లో శుభ కార్యాలైనా కొబ్బరికాయ కొట్టనిదే పూర్తి కాదు. దేవుడికి కొబ్బరికాయ కొట్టడం వెనుకున్న ఆంతర్యం మనకు తెలుసు. కొబ్బరికాయ కొట్టి దేవుడిని కోరికలు కోరుకోవడం సహజమే. దేవుడా నన్ను రక్షించు నాకు డబ్బు బాగా వచ్చేలా చూడు తండ్రి అంటూ వేడుకోవడ చేస్తుంటారు.
కొబ్బరికాయ ఎందుకు కొడతారు?
భగవంతుడికి కొబ్బరికాయ కొట్టడంలో అర్థం ఏమిటి? భగవంతుడి ముందు కొబ్బరికాయ కొట్టడంలో మనలో ఉన్న అహంకారాన్ని నాశనం చేస్తున్నామని సంకేతంగానే భావిస్తారు. కొబ్బరికాయ పైన ఉన్న పెంకు న అహానికి ప్రతీక. కొబ్బరి చిప్పలను భగవంతుడి ముందు నివేదించడం వల్ల మన తెల్లనైన మనసును దేవుడి ముందు పరిచినట్లుగా చెబుతారు. కొబ్బరి నీళ్లలాగా మనలోని మనసు కూడా నిర్మలంా ఉంచాలని భగవంతున్ని ప్రార్థిస్తుంటాం. కొబ్బరికాయను కొట్టడంలో అసలు అర్థం ఇదే.
పూర్వం నుంచి..
కొబ్బరికాయ కొట్టడం అనేది పూర్వం నుంచి వస్తున్న ఆచారమే. మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాన్నే మనం కొనసాగిస్తున్నాం. కొబ్బరికాయ పైన ఉండే పీచును జుట్టుగా కొబ్బరికాయను మన శరీరంగా అందులో ఉండే నీళ్లను మన రక్తంలాగా చెబుతారు. అందుకే భగవంతుడికి కొబ్బరికాయను నివేదించడం సహజమే. మనసులో ఉండే రాగద్వేషాలను దూరం చేసుకునేందుకు కొబ్బరికాయ కొడతారు. ఇందులో దాగి ఉన్న పరమార్థం ఇదే.
కుళ్లిపోతే ఏమవుతుంది?
కొబ్బరికాయ కుళ్లిపోతే అరిష్టమని అందరు అనుకుంటారు. కానీ ఇందులో నిజం లేదు. మన ధర్మశాస్త్రం ప్రకారం కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్లిపోతే భయపడాల్సిన పనిలేదు. నిర్మలమైన మనసుతో కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కుని తిరిగి పూజను కొనసాగించవచ్చు. కొబ్బరికాయ కుళ్లిపోతే కీడు సంభవిస్తుందని, చెడు జరుగుతుందని అనుకోవడం అపోహే. కొబ్బరికాయ కుళ్లిపోయినా అది సహజంగా జరిగిందే తప్ప అందులో ఎవరి ప్రమేయం లేదని గుర్తించుకోవాలి.

Spoiled Coconut
పువ్వు వస్తే అదృష్టమా?
కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వస్తే శుభంగా అనుకుంటారు. భగవంతుడికి నిష్టగా చేసే పూజలో కొబ్బరికాయ కొట్టడం అందరు చేస్తుంటారు. అందులో పువ్వు వచ్చినా అది మన ప్రమేయం లేకుండానే వస్తోంది. అంతే తప్పు అందులో ఎలాంటి లాభాలు, నష్టాలు ఉండవు. అది మనం అనుకుంటాం. మంచి జరుగుతుందని అంతే. కానీ కొబ్బరికాయ కొట్టి మనకు మంచి జరగాలని కోరుకోవడంలో తప్పు లేదు. పువ్వు వస్తే త్వరగా సంతానం కలుగుతుందని నమ్ముతారు.