Mahesh Babu-Puri Jagannadh: పూరి జగన్నాథ్ కి మహేష్ బాబు కి మధ్య ఏం జరిగింది…
.ఇప్పటి వరకు ఇండస్ట్రీలో బెస్ట్ కాంబినేషన్ అంటే పూరి జగన్నాథ్ , మహేష్ బాబు గారిదనే చెప్పాలి. ఈ కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి…

Mahesh Babu-Purijagannadh: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది స్టార్ హీరోలు వాళ్ల స్టార్ డమ్ ను పెంచుకోవడానికి మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటూ ప్రేక్షకులకు మంచి సినిమాలను అందించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే వాళ్లు చాలా మంది డైరెక్టర్లు చెప్పే కథలను వింటూ ఏ కథ అయితే వాళ్ళకి బాగా సెట్ అవుతుందో ఆ కథతో సినిమా చేయడానికి రెడీగా ఉంటారు. అందుకే స్టార్ హీరోలు అందరూ కూడా స్టార్డమ్ ఉన్న డైరెక్టర్ల తో సినిమా చేయాలని కోరుకుంటూ ఉంటారు.ఇండస్ట్రీలో ఒక టైంలో ఒకరు లైమ్ లైట్ లో ఉంటారు అలాంటి వాళ్లను పట్టుకొని సినిమాలు చేయడం వల్ల హీరోల క్రేజ్ పెరుగుతుంది,అలాగే సినిమాకు మార్కెట్ కూడా భారీ లెవెల్ లో అవుతుందని స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు.అలాగే స్టార్ డైరెక్టర్లు స్టార్ హీరోల చుట్టూ తిరుగుతూ ఉంటారు.
అలా వీళ్ళిద్దరికీ మధ్య ఒక మంచి కాంబినేషన్ అనేది సెట్ చేసుకొని సినిమా చేస్తూ ఉంటారు.ఇప్పటి వరకు ఇండస్ట్రీలో బెస్ట్ కాంబినేషన్ అంటే పూరి జగన్నాథ్ , మహేష్ బాబు గారిదనే చెప్పాలి. ఈ కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి… పోకిరి ఇండస్ట్రీ హిట్ కొట్టగా బిజినెస్ మ్యాన్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వీళ్ళ కాంబినేషన్ లో రావాల్సిన మూడో సినిమా ఆగిపోయింది.దానికి కారణం ఏంటి అనేది కరెక్ట్ గా తెలియదు కానీ మహేష్ బాబు వైఖరి పట్ల పూరి జగన్నాథ్ ఫీల్ అయినట్టుగా తెలుస్తుంది. ఆయన సినిమా చేద్దాం అంటే మహేష్ చేద్దాం అనుకుంటూ ఎప్పటికప్పుడు పూరి జగన్నాథ్ మాటను దాటవేస్తున్నాడు గాని చేద్దామా, వద్దా అనేది మహేష్ బాబు క్లారిటీ ఇవ్వకపోవడంతో విపరీతం గా హర్ట్ అయిన పూరి జగన్నాథ్ వేరే వాళ్ళతో సినిమాలు చేస్తున్నాడు. ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే మాత్రం దానికి విపరీతమైన క్రేజ్ ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. వీళ్ళ మధ్య నున్న గొడవలు అన్ని సర్దుకొని ఫ్యూచర్ లో వీళ్ళ కాంబోలో సినిమా వస్తుందేమో చూడాలి……
