Paritala Sriram: చాలా కాలంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ డ్యామేజ్ చేసే ఒక వార్త ప్రచారంలో ఉంది. తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి పవన్ కళ్యాణ్ కి గుండు కొట్టి అవమానించారనేది ఒక కథనం. చిరంజీవికి చెందిన స్థలాన్ని మంత్రిగా ఉన్న పరిటాల రవి కబ్జా చేశారు. అన్యాయం అని అడిగిన చిరంజీవిని పరిటాల అవమానించాడు. అన్నయ్యను అవమానించాడనే కోపంతో పవన్ కళ్యాణ్ పరిటాల రవిని నిలదీసేందుకు వెళ్లాడని, అప్పుడు పవన్ కళ్యాణ్ కి గుండు చేసిన పరిటాల రవి అవమాన పరిచారు అంటారు. ఇది పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో వినిపించిన ఒక వార్త.

Paritala Sriram
పవన్ రాజకీయాల్లోకి వచ్చాక దీన్ని తెరపైకి తెచ్చారు. పవన్ కళ్యాణ్ ని అవమానించేలా ప్రత్యర్థులు ఈ కోణంలో ఆయనపై మాటల దాడి చేస్తూ ఉంటారు. పరిటాల రవి చనిపోగా… ఆయన కుమారుడు శ్రీరామ్ దీనిపై స్పష్టత ఇచ్చారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీరామ్ యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇలా చెప్పారు.
పవన్ కళ్యాణ్ ని పరిటాల రవి అవమానించారు అనడంలో ఎలాంటి నిజం లేదు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేందుకు ప్రత్యర్థుల కుట్ర మాత్రమే ఇది. ఆయనతో మాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఇవన్నీ నిరాధార ఆరోపణలే. పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేయడానికి సృష్టిస్తున్న వదంతులు. ప్రచారమైనట్లు అలాంటిది ఏమీ జరగలేదని పరిటాల శ్రీరామ్ స్పష్టత ఇచ్చారు. దీంతో దశాబ్దాలుగా ప్రచారంలో ఉన్న అపవాదు తొలగినట్లు అయ్యింది.

Pawan Kalyan and Paritala Ravi
ఇకనైనా ప్రత్యర్ధులు ఈ పాత చింతకాయ పచ్చడి రూమర్స్ కి స్వస్తి పలకాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ టీడీపీ మిత్రపక్షంగా ఉన్నప్పుడు పరిటాల కుటుంబాన్ని అనంతరంపురంలో కలిశారు. వారి నివాసానికి ఆయన వెళ్లడం జరిగింది. మరోవైపు పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటున్నారు. హరిహర వీరమల్లు త్వరగా పూర్తి చేసి 2024 ఎన్నికలకు సంసిద్ధం కావాలి అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా దూకుడు చూపిస్తున్నారు.