Healthy Foods: మన దైనందిన జీవితంలో ఆహార అలవాట్లు అదుపుతప్పుతున్నాయి. దీంతో మనకు లేనిపోని రోగాలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి వేళ ఎక్కువ కార్బోహైడ్రేడ్లు ఉన్న ఆహారం పెద్ద మొత్తంలో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపుతప్పుతాయి. షుగర్ లెవల్స్ పెరుగుతాయి. రక్తంలో చక్కెర పెరగడంతో మధుమేహులకు ఇబ్బందులు తలెత్తుతాయి. కార్బోహైడ్రేడ్లు ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే లేనిపోని రోగాలు వస్తాయి.

Healthy Foods
రాత్రి వేళ మాంసాహారానికి దూరంగా ఉంటేనే ప్రయోజనం. మాంసంలో ఉండే అధిక ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు తొందరగా జీర్ణం కావు. దీంతో కడుపు ఉబ్బరంగా మారి నిద్ర పట్టదు. అందుకే రాత్రిపూట ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. త్వరగా అరిగే పదార్థాలు తీసుకుని మంచి ఆరోగ్యం కలిగేలా శ్రద్ధ తీసుకుంటే ఎంతో మంచిది. ఐస్ క్రీమ్స్, చిప్స్, చీజ్ ఫ్రైడ్ ఫుడ్స్ లోనూ కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండటంతో తొందరగా జీర్ణం కావు. దీంతో ఇబ్బందులు తలెత్తుతాయి.
పగటి పూట భోజనం చేసిన తరువాత అరటి పండు తింటే ప్రయోజనం. రాత్రి వేళల్లో అరటి పండు తినడం మంచిది కాదు. దీని వల్ల ఊపిరితిత్తుల్లో శ్లేష్మాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఆపిల్ తింటే కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది కూడా రాత్రి వేళలో తినడం వల్ల పొట్టలో యాసిడ్ స్థాయిలు పెరిగే అవకాశాలున్నందున తినడానికి ఆసక్తి చూపొద్దు. చాలా మంది డార్క్ చాక్లెట్లు తినడానికి ఇష్టపడతారు. వీటిని కూడా రాత్రి పూట తినకపోతేనే ఉత్తమం. ఒకవేళ తింటే నిద్ర సరిగా పట్టక తిప్పలు పడాలి.

Healthy Foods
పుచ్చకాయ, ద్రాక్ష కూడా రాత్రి వేళలో తినొద్దు. ఇందులో ఉండే నీరు వల్ల మూత్రం వస్తుంది. నిద్రకు భంగం కలుగుతుంది. అందుకే రాత్రి సమయాల్లో వీటిని తీసుకోవద్దు. రాత్రుళ్లు మసాలాలతో కూడిన వంటకాలు తీసుకోవడం కష్టమే. ఎసిడిటి తో ఇబ్బందులు కలుగుతాయి. దీంతో నిద్ర సరిగా పట్టదు. బరువు తగ్గాలనుకునే వారు రాత్రి పూట ఆహారాలు మానేస్తారు. త్వరగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకుంటేనే లాభాలు ఉంటాయి. ఈ జాగ్రత్తలు తీసుకుని రాత్రి పూట మంచి నిద్ర పట్టేందుకు చర్యలు తీసుకోవాలి.