Eat Before Sleep: రోజూ రాత్రిపూట అసలేం తినాలో తెలుసా?
Eat Before Sleep: బోజనం విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందే. మనం తినే ఆహారమే మనకు రక్షణ ఇష్తుంది. మన ప్రాణం నిలబడేలా చేస్తుంది. కానీ మనిషి రకరకాల తిండ్లతో తన శరీరాన్ని గుళ్ల చేసుకుంటున్నాడు. ఫలితంగా రోగాల బారిన పడుతున్నాడు. నిండు నూరేళ్లు జీవించాల్సిన శరీరాన్ని యాబై ఏళ్లకే పరిమితం చేస్తున్నాడు. ఫలితంగా తన ఆయుర్దాయాన్ని తగ్గించుకుంటున్నాడు. ప్రకృతి వైద్య విధానంలో సూచించిన విధంగా ఆహారం తీసుకుంటే ప్రయోజనాలు ఉంటాయని తెలిసినా వాటిని పట్టించుకోవడం లేదు. జిహ్వ […]

Eat Before Sleep: బోజనం విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందే. మనం తినే ఆహారమే మనకు రక్షణ ఇష్తుంది. మన ప్రాణం నిలబడేలా చేస్తుంది. కానీ మనిషి రకరకాల తిండ్లతో తన శరీరాన్ని గుళ్ల చేసుకుంటున్నాడు. ఫలితంగా రోగాల బారిన పడుతున్నాడు. నిండు నూరేళ్లు జీవించాల్సిన శరీరాన్ని యాబై ఏళ్లకే పరిమితం చేస్తున్నాడు. ఫలితంగా తన ఆయుర్దాయాన్ని తగ్గించుకుంటున్నాడు. ప్రకృతి వైద్య విధానంలో సూచించిన విధంగా ఆహారం తీసుకుంటే ప్రయోజనాలు ఉంటాయని తెలిసినా వాటిని పట్టించుకోవడం లేదు. జిహ్వ చాపల్యాన్ని చంపుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. మద్యం, మాంసం విచ్చలవిడిగా వాడుతూ శరీరానికి నష్టం తెచ్చుకుంటున్నారు. అయినా వారిలో మార్పు మాత్రం రావడం లేదు.

Eat Before Sleep
మనం రాత్రి పూట తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు పాటిస్తే పలు లాబాలు ఉంటాయి. ఎక్కువ శాతం మంది మూడు పూటలు అన్నమే తింటున్నారు. దీంతో రోగాలకు దగ్గరవుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు మాత్రం రాత్రి బోజనంలో చపాతి తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో ఎక్కువ మంది చపాతీల వైపు చూస్తున్నా ఇంకా కొందరు అన్నమే తింటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. దీంతో వారి జీవన ప్రక్రియ మందగించి వ్యాధులు దరిచేరుతున్నాయి.
Also Read: Rajendra Prasad’s Son: షాకింగ్..రాజేంద్రప్రసాద్ కొడుకు ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా..?
రాత్రి తీసుకునే భోజనంలో గోధుమ పిండితో చేసిన చపాతీలను తీసుకుంటే మంచిదే. అవి కూడా నూనె పెట్టకుండా కాల్చితే ప్రయోజనం ఉంటుంది. వాటిని పుల్కాలు అంటారు. నూనెతో మనకు హాని ఉంటుంది కాబట్టే నూనె లేకుండా చపాతీలు చేసుకుని మూడు తీసుకుంటే చాలు. దీంతో అవి మన శరీరంలో మెల్లగా అరుగుతాయి. దీంతో గ్లూకోజ్ స్థాయి కూడా పెరగదు. అందుకే సాయంకాలం పూట గోధమ పిండితో తయారు చేసే పుల్కాలను తీసుకుంటేనే ఆరోగ్యానికి రక్షణ కలుగుతుంది.

Eat Before Sleep
అయితే గోధుమ పిండి బ్రాండెడ్ ది అయి ఉండాలి. నకిలీ పిండిలో మైదా కలుస్తుంది. దీంతో అనారోగ్యమే. రాత్రి తిన్నాక కూడా ఓ గంటన్నర పాటు పడుకోకుండా ఉండాలి. తినగానే పడుకుంటే కొవ్వు పెరుగుతుంది. అందుకే రాత్రి భోజనం తరువాత పడుకోకుండా ఉండటమే శ్రేయస్కరం. చపాతీలు ఆరోగ్యానికి మంచివనే వైద్యులు సైతం సూచించడంతో రాత్రి పూట ఆహారంలో వాటిని తీసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు.
Also Read:Karate Kalyani: ప్రేమ పెళ్లి పేరుతో మోసం వాడుకుని వదిలేశారు… పిల్లల్ని కనాలనే ఆశ ఇంకా ఉంది
Recommended Videos