Mukesh Ambani: అంబానీ వారసులు ఏం పనిచేస్తారు? ఎంత సంపాదిస్తారు.. వాళ్లపై స్పెషల్ స్టోరీ

ముఖేష్-నీతూ అంబానీల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ. ఆకాశ్ చిన్నప్పటి నుంచే చురుకైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఓ వైపు ఉన్నత చదువులు చదువుతూనే బిజినెస్ లో మెళకువలు నేర్చుకున్నాడు.

  • Written By: SS
  • Published On:
Mukesh Ambani: అంబానీ వారసులు ఏం పనిచేస్తారు? ఎంత సంపాదిస్తారు.. వాళ్లపై స్పెషల్ స్టోరీ

Mukesh Ambani: దేశంలోనే కాకుండా ప్రపంచంలోని రిచెస్ట్ ఫీపుల్స్ లో ముఖేష్ అంబానీ ఎప్పుడూ టాప్ లోనే ఉంటున్నారు. తన వ్యాపారాలను ఎప్పటికప్పుడు డెవలప్ చేస్తూ రోజురోజుకు ఆదాయాన్ని పెంచుకుంటూ పోతున్నారు. గత ఐదారేళ్లుగా అంబానికి అదానీ తప్ప మరెవరూ పోటీ రావడం లేదు. అయితే అంబానీ తాను మాత్రమే కాకుండా తన వారసులను కూడా మంచి పొజిషన్లో ఉంచారు. వీరు ఊరికే ఉండకుండా తమకు కేటాయించిన వ్యాపారాలను ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖేష్-నీతూ అంబానీలకు ముగ్గురు పిల్లలు. వీరిలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ముఖేష్ రెండో కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థం ఇటీవలే జరిగింది. దీంతో అంబానీ ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సమయంలో అంబానీ కుమారులు, కుమార్తె ఏం చేస్తున్నారో తెలుసుకుందాం.

సాధారణంగా తండ్రులు ఆస్తులు కూడబెడితె పిల్లలు హాయిగా జీవించాలని చూస్తారు. కానీ లక్షల కోట్ల సంపద ఉన్న ముఖేష్ తన పిల్లలకు డబ్బు ఆశ చూపలేదు. చిన్నప్పటి నుంచే వారిని విద్యావంతులుగా తీర్చిదిద్ది వ్యాపారంలో మెళకువలు నేర్పించారు. బిజినెస్ లోనే మనకు జీవితం ఉంటుందనే విధంగా తయారు చేశాడు. దీంతో వారి కుమారుడు తల్లిదండ్రుల పెంపకంలో ఎంతో అనుకువగా ఉండి తమ జీవితాలను సార్థకం చేసుకున్నారు. ఎటువంటి చెడు ఆలోచనలు పెట్టుకోకుండా తండ్రి బాటలోనే వ్యాపారంలో రాణిస్తూ అందరిచేత శభాష్ అని అనిపించుకుంటున్నారు.

ముఖేష్-నీతూ అంబానీల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ. ఆకాశ్ చిన్నప్పటి నుంచే చురుకైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఓ వైపు ఉన్నత చదువులు చదువుతూనే బిజినెస్ లో మెళకువలు నేర్చుకున్నాడు. ఐర్లాండ్ లోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ లో డిగ్రీ పూర్తి చేయిన ఆయన ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీలో భాగమైన జియోకు నాయకత్వం వహిస్తున్నాడు. తండ్రి బాటలో వెళ్లిన ఆకాశ్ పర్సనల్ టర్నోవర్ నెలకు రూ.45 లక్షలు ఉంటుందని సమాచారం.

ముఖేష్ గారాలఏకైక కూతురు ఇషా అంబానీ. ఈమె యేల్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందారు. ఆ తరువాత స్టాన్ ఫోర్ట్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెల్ లో చదువుకున్నారు. ప్రస్తుతం ఇషా రిలయన్స్ ఇండస్ట్రీలో జియో రిటైల్ విభాగానికి నాయకురాలిగా ఉన్నారు. అంతకుముందు ఈమె మెకిన్సెస్ లో కన్సల్టెంట్ గా పనిచేశారు. పిరమల్ గ్రూప్ నకు చెందిన అజయ్ అనే వ్యక్తిని ఇషా పెళ్లి చేసుకున్నారు. ఇషా నెల సంపాదన రూ.35 లక్షలని తెలుస్తోంది.

ముఖేష్ దంపతుల చిన్న కుమారుడు అనంత్ సైతం వ్యాపారంలోనే రాణిస్తున్నారు. ఈయన అందరి కంటే చిన్నవాడు. ప్రస్తుతం అనంత్ అంబానీ రిలయన్స్ ఎనర్జీకి నాయకత్వం వహించబోతున్నాడు. ఈ విషయాన్ని 2022 ఆగస్టు 29న ముఖేష్ అంబానీ ప్రకటించాడు. ఇటీవల అనంత్ అంబానీ పేరు మీద 80 మిలయ్ డాలర్ల విలువ చేసే ఇంటిని కొనుగోలు చేశాడు. అనంత్ కూడా ఐర్లాండ్ లోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందాడు. ప్రతీ నెల అనంత్ అంబానీ ఆదాయం రూ.35 లక్షలు ఉంటుందని సమాచారం.

Read Today's Latest Life style News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు