Vijay Devarakonda Liger: లైగర్ పరాజయం తర్వాత విజయ్ ఏం చేశాడు: తెలిస్తే ఆశ్చర్యపోతారు
Vijay Devarakonda Liger: సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. నటీనటులు ఎంత పైకి వేగంగా ఎదుగుతారో… అంతే కిందికి వస్తారు. ఎంతోమంది నటీనటులు ఇలాంటి ఎత్తు పల్లాలు చూసినవారే. అంత హేమహేమి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, అమితాబ్ బచ్చన్ లాంటివారే పరాజయాలను చూశారు. తర్వాత వారిని వారు పునరావిష్కరించుకున్నారు. అయితే ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలతో విడుదలైన లైగర్ సినిమా పరాజయం పాలయింది. ఈ సినిమా హీరో విజయ్ దేవరకొండ ను నేలకు దింపింది.ఈ […]

Vijay Devarakonda Liger: సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. నటీనటులు ఎంత పైకి వేగంగా ఎదుగుతారో… అంతే కిందికి వస్తారు. ఎంతోమంది నటీనటులు ఇలాంటి ఎత్తు పల్లాలు చూసినవారే. అంత హేమహేమి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, అమితాబ్ బచ్చన్ లాంటివారే పరాజయాలను చూశారు. తర్వాత వారిని వారు పునరావిష్కరించుకున్నారు. అయితే ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలతో విడుదలైన లైగర్ సినిమా పరాజయం పాలయింది. ఈ సినిమా హీరో విజయ్ దేవరకొండ ను నేలకు దింపింది.ఈ సినిమాకు నిర్మాతలుగా పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ వ్యవవరించారు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలను చవి చూసింది. డిస్ట్రిబ్యూటర్లు పూరి జగన్నాథ్ పై యుద్ధం ప్రకటించారు. ఇప్పటికీ ఆ గొడవ సద్దుమణగలేదు. అయితే ఈ పరాజయాన్ని సినిమా హీరో విజయ్ దేవరకొండ చాలా సింపుల్ గా తీసుకున్నాడు. ఈ విషయాన్ని అతని ఆప్త మిత్రులైన రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి వెల్లడించారు.. ఇటీవల ఓ ప్రైవేట్ ఛానల్ నిర్వహించిన టాక్ షోలో వాళ్ళు పాల్గొన్నారు.

Vijay Devarakonda
బౌన్స్ బ్యాక్ అవుతాడు
విజయ్ దేవరకొండ.. సెల్ఫ్ రెస్పెక్టెడ్ పర్సనాలిటీ. దీనిని అంత సులభంగా తీసుకోడు.. గెలిచినా, ఓడినా ఒకే తీరుగా ఉంటాడు. లైగర్ పరాజయం తర్వాత దాని తాలూకు నష్టాలను ఆయన కూడా భరించాడు. నిర్మాత పూరి జగన్నాథ్ కు డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చాడు. సినిమా పరాజయం పొందినా పెద్దగా నైరాశ్యంలో కూరుకు పోలేదు.
ఖుషీలో సమంత తో..
శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే ఒక సినిమాలో విజయ్ నటిస్తున్నాడు. ఇందులో సమంత హీరోయిన్. ఆమె మయోసైటిస్ బారిన పడటంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది.. త్వరలో అది పట్టాలు ఎక్కుతుంది. సినిమా పట్ల డెడికేషన్ గా పనిచేయడం విజయ్ కి ఉన్న అలవాటు. ఏ సినిమాకైనా ప్రాణం పెడతాడు. లైగర్ సినిమా కోసం తన దేహాన్ని చాలా కష్టపెట్టుకున్నాడు. సిక్స్ ప్యాక్ కోసం చాలా ఇబ్బంది పడ్డాడు.. ఆయన పాత్ర పరంగా బాగానే ఉన్నప్పటికీ… కథ,కథనం విషయంలో దర్శకుడు సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల సినిమా ప్లాప్ అయింది. అయితే ఈ పరాజయం తర్వాత విజయ్ ఏ మాత్రం ఇబ్బంది పడలేదు. తన పనిలో తాను నిమగ్న మయ్యాడు. త్వరలో గట్టిగా కొడదామంటూ స్నేహితులకు మాట ఇచ్చాడు. అదే విషయాన్ని రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి వెల్లడించారు.

Vijay Devarakonda
మార్కెట్ తగ్గింది
విజయ్ అంతకుముందు సినిమాలు డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి.. అయితే అదే సమయంలో పూరి జగన్నాథ్ తో లైగర్ అనే సినిమా అనౌన్స్ చేశాడు. ప్రమోషన్ వర్క్ బాగా చేయడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సినిమా ప్లాప్ తర్వాత విజయ్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం ఖుషి తర్వాత ఆయన చేతిలో పెద్దగా సినిమాలు లేవు. అయితే ఈ అనుభవాలు విజయ్ కి కొత్త కాదని అతని స్నేహితులు చెబుతున్నారు. త్వరలోనే మంచి కం బ్యాక్ ఇస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
