Baby Heroine Vaishnavi: బోల్డ్ సీన్స్ లో నిన్ను చూసి పేరెంట్స్ ఏమన్నారు? బేబీ హీరోయిన్ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్
నేను స్పెసిఫిక్ గా అడిగాను. మూవీ కంటెంట్ మాత్రమే చూశాను అన్నారు. అలాంటి సీన్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదని చెప్పారని వైష్ణవి సమాధానం చెప్పింది. ఇక యూట్యూబర్ గా కెరీర్ మొదలు పెట్టిన వైష్ణవి చైతన్యకు బ్రేక్ వచ్చిందని చెప్పొచ్చు ఇకపై ఆమెకు హీరోయిన్ ఆఫర్స్ వస్తాయా లేదా అనేది చూడాలి. ఈ మూవీలో ఆఫర్ ఇవ్వడం ద్వారా నాకు దర్శకుడు సాయి రాజేష్ పునర్జన్మ ఇచ్చాడని ఆమె చెప్పుకొచ్చారు.

Baby Heroine Vaishnavi: ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం బేబీ. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన బేబీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే వసూళ్ళ పరంగా భేష్ అనిపిస్తుంది. ఫస్ట్ డే బేబీ రూ. 7 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టినట్లు ప్రకటించాయి. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించాయి. వైష్ణవి చైతన్యకు ఓ చిక్కు ప్రశ్న ఎదురైంది. బోల్డ్ సీన్స్ లో నటించారు. మీ పేరెంట్స్ స్పందన ఏంటని? అడగడం జరిగింది.
ఈ ప్రశ్నకు తడుముకోకుండా వైష్ణవి సమాధానం చెప్పింది. చిన్నప్పటి నుండి అలా ఉండాలి ఇలా ఉండాలని మా పేరెంట్స్ రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. బేబీ సినిమాలో బోల్డ్ సీన్స్ ఉన్నాయి. మా పేరెంట్స్ అవి చూస్తూ కేవలం పాత్రను ఊహించుకున్నారు. అక్కడ వాళ్ళ అమ్మాయిని చూస్తున్న భావన కలగలేదు. పేరెంట్స్ గా కాకుండా ఆడియన్స్ గా చూశారు. కొంచెం ఇబ్బందికర ఫీలింగ్ ఏదైనా కలిగినా థియేటర్ నుండి బయటకు వచ్చాక ఆ ఫీలింగ్ కూడా పోయింది.
నేను స్పెసిఫిక్ గా అడిగాను. మూవీ కంటెంట్ మాత్రమే చూశాను అన్నారు. అలాంటి సీన్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదని చెప్పారని వైష్ణవి సమాధానం చెప్పింది. ఇక యూట్యూబర్ గా కెరీర్ మొదలు పెట్టిన వైష్ణవి చైతన్యకు బ్రేక్ వచ్చిందని చెప్పొచ్చు ఇకపై ఆమెకు హీరోయిన్ ఆఫర్స్ వస్తాయా లేదా అనేది చూడాలి. ఈ మూవీలో ఆఫర్ ఇవ్వడం ద్వారా నాకు దర్శకుడు సాయి రాజేష్ పునర్జన్మ ఇచ్చాడని ఆమె చెప్పుకొచ్చారు.
ఒక యూట్యూబ్ అమ్మాయి మెయిన్ లీడ్ చేస్తుందా? ఈమె వల్ల అవుతుందా ? అని కొందరు కామెంట్స్ చేశారు. నేను కూడా విశ్వాసం కోల్పోయాను. నాకు అన్ని విషయాలు సహనంగా వివరించి, మూవీ పూర్తి చేసేందుకు డైరెక్టర్ అండగా నిలబడ్డాడని చెప్పుకొచ్చారు. బేబీ ప్రీ రిలీజ్ వేడుకలో వైష్ణవి కన్నీరు పెట్టుకుంది. ఈ చిత్రానికి ఎస్కేఎన్ నిర్మాత. ఈ జనరేషన్ ప్రేమకథగా తెరకెక్కింది.