Nails And Hair: జుట్టు, గోళ్లు ఏ ఈరోజుల్లోనే తీసుకోవాలి
మనలో చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడు సమయం దొరికినప్పుడల్లా గోర్లు కత్తిరించుకుంటారు. జుట్టు తొలగించుకుంటారు. కానీ అలా చేయకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే దాని వల్ల ఉపద్రవం ముంచుకొస్తుంది.

Nails And Hair: మనదేశంలో ప్రతి దానికి ఓ రోజు కేటాయిస్తుంటాం. ఏ పనిచేయాలన్నా ఫలానా రోజు చేయాలనే చెబుతారు. అందుకే మనం ఏ పనిచేయాలన్నా ముహూర్తం చూసుకుని చేస్తాం. దీంతో ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని ఆశిస్తాం. అందులో భాగంగానే మన సంకల్పం ఉంటుంది. ఏ రోజు ఏ పనిచేయాలో మనకు వాస్తు శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. కొన్ని పనులు ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. అలా చేస్తే అరిష్టం కలుగుతుంది.
మనలో చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడు సమయం దొరికినప్పుడల్లా గోర్లు కత్తిరించుకుంటారు. జుట్టు తొలగించుకుంటారు. కానీ అలా చేయకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే దాని వల్ల ఉపద్రవం ముంచుకొస్తుంది. కష్టాలు వెంటాడతాయి. వాటికి కూడా ప్రత్యేకంగా రోజులు కేటాయించబడ్డాయి. అందుకే ఆ సమయంలోనే వాటిని తీసుకుంటే మంచిది.
వాస్తు శాస్త్రంలో ఇలాంటి వాటికి ప్రత్యేకంగా రోజులు కేటాయించారు. ఆ రోజుల్లోనే చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. బుధ, శుక్రవారాలు జుట్టు కత్తిరించుకోవడానికి గోళ్లు తీసుకోవడానికి అనువైన రోజులుగా చెబుతుంటారు. అందుకే ఈ రోజుల్లోనే ఈ పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతుంటారు. వాస్తు ప్రకారం కూడా వాటినే నమ్మాలి.
ఇలా మిగతా రోజుల్లో వాటిని తీసుకుంటే మనకు ఇబ్బందులు కలుగుతాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లో మిగతా రోజుల్లో తీసుకునేందుకు మొగ్గు చూపకూడదు. ఒకవేళ అలా చేస్తే మనకు జీవితంలో కష్టాలు ఎదురవుతాయని చెబుతారు. వాస్తు శాస్త్రాన్ని నమ్మి బుధ, శుక్ర వారాల్లోనే ఈ పనులు చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తించాలి.
