Nerve Weakness: నరాల బలహీనత పోయి బలంగా తయారవ్వాలంటే ఇది తినాలి

మంచి నిద్ర కూడా ఆరోగ్యాన్ని సూచిస్తుంది. రోజుకు కనీసం 7-9 గంటలు నిద్ర పోతేనే ఆరోగ్యం బాగుంటుంది. సరైన నిద్ర లేకపోతే ఇతర వ్యాధులు రావచ్చు. అందుకే నిద్రకు మనం ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. ఇటీవల కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలా అయితే మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

  • Written By: Srinivas
  • Published On:
Nerve Weakness: నరాల బలహీనత పోయి బలంగా తయారవ్వాలంటే ఇది తినాలి

Nerve Weakness: ఈ రోజుల్లో నరాల బలహీనత బాధిస్తోంది. అనుకోకుండా తిమ్మిర్లు రావడం, ముఖంలో చలనం లేకుండా పోవడం వంటి లక్షణాలుంటే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. నరాల బలహీనతతోనే ఇలా జరుగుతుంది. ఒక్కోసారి తలనొప్పి ఇబ్బంది పెడుతుంటే నిర్లక్ష్యం చేయకండి వైద్యులను సంప్రదించాల్సిందే. ప్రస్తుత కాలంలో చాలా మంది సరైన జీవన శైలి పాటించకపోవడం వల్లే ఇలా జరుగుతుంది.

పోషకాలు

పోషకాలు లేని ఆహారాలు తినడం వల్ల వ్యాధుల ముప్పు పెరుగుతోంది. దీంతో నరాల బలహీనత ఎక్కువగా వస్తోంది. ఏ పనిచేసినా కాసేపటికే అలసిపోవడం మన బలహీనతను సూచిస్తుంది. ప్రతి రోజు అన్నంతో పాటు ఇతర పోషకాలు ఉన్న ఆహారాలు తీసుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది. పచ్చికొబ్బరి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరిలో పుష్కలమైన ప్రొటీన్లు ఉన్నాయి.

సరైన నిద్ర

మంచి నిద్ర కూడా ఆరోగ్యాన్ని సూచిస్తుంది. రోజుకు కనీసం 7-9 గంటలు నిద్ర పోతేనే ఆరోగ్యం బాగుంటుంది. సరైన నిద్ర లేకపోతే ఇతర వ్యాధులు రావచ్చు. అందుకే నిద్రకు మనం ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. ఇటీవల కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలా అయితే మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

వారానికి రెండుసార్లు

నరాల బలహీనత రాకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లు అయినా పచ్చికొబ్బరి తింటే ఎముకలు బలంగా మారతాయి. గుండె సంబంధిత సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. పచ్చి కొబ్బరి తినడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేస్తుంది. దీంతో మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది.

Read Today's Latest Health news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు