World Cup 2023: అంత బాగా ఆడి ఫైనల్ లో టీమిండియాకు ఎందుకీ దుస్థితి..?
బౌండరీ లైన్స్ మీద వరుసగా ఫోర్లు అపిన విధానం చూస్తే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ల స్పిరిట్ లెవల్ కి ఫిదా అవ్వాల్సిందే… ఒక్క బాల్ కూడా వాళ్ళని దాటుకొని ముందుకు కదల లేదు అంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ల ఫీల్డింగ్ స్టాండర్డ్ గానీ,

World Cup 2023: 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియన్ టీం ఓడిపోవడానికి కారణాలు చాలా ఉన్నప్పటికీ ప్రధానమైన కారణాలు మాత్రం రెండు కనిపిస్తున్నాయి. ఒకటి ఇండియన్ టీం ప్లేయర్లు బ్యాటింగ్ లో ఫెలవగా దానివల్లే చాలా తక్కువ స్కోరు చేయగలిగారు.ఇక గ్రౌండ్ లో ఫీల్డింగ్ చేసేటప్పుడు అసలు ఏమాత్రం ప్రభావం చూపించకుండా ఈ మ్యాచ్ మనం ఓడిపోతున్నాం అని ముందు నుంచి డిసైడ్ అయిపోయి ఫీల్డింగ్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఒక్క డైవ్ చేసి ఒక్క బంతిని కూడా ఆపడంలో చాలా వరకు మనవాళ్ళు పూర్ ఫీల్డింగ్ పర్ఫామెన్స్ ని చూపించారు. ఇక అందువల్లే ఇండియన్ టీం ఓడిపోవడానికి ఇది ఒక ముఖ్య కారణాలుగా మారాయి.ఇక ఏది ఏమైనా ఇండియన్ టీమ్ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయింది…
ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్లు
బౌండరీ లైన్స్ మీద వరుసగా ఫోర్లు అపిన విధానం చూస్తే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ల స్పిరిట్ లెవల్ కి ఫిదా అవ్వాల్సిందే… ఒక్క బాల్ కూడా వాళ్ళని దాటుకొని ముందుకు కదల లేదు అంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ల ఫీల్డింగ్ స్టాండర్డ్ గానీ, గెలవాలనే తపన కానీ వాళ్లలో ఎంతలా ఉందో…37 ఏళ్ల వార్నర్ బౌండరీ లైన్ వద్ద అడ్డంగా గోడ కట్టారా అన్నట్లు ఫీల్డింగ్ చేశాడు.ఆయన లాగా మన టీమ్ లో ఒక్క ప్లేయర్ కూడా అంత ఎఫర్ట్ పెట్టీ ఫీల్డింగ్ చేయలేదు అంటే మన వాళ్ళకి విజయం మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు…
ఇక ఫీల్డింగ్ చేసి ఆస్ట్రేలియన్ ప్లేయర్లు దాదాపు ఒక 50 పరుగుల వరకు సేవ్ చేశారు అంటే అక్కడే మనం సగం ఓడిపోయాం…ఇక బౌండరీ లా విషయానికి వస్తే 11 ఓవర్ నుంచి 50 ఓవర్ల మధ్యలో కేవలం 4 ఫోర్లు మాత్రమే వచ్చాయి అంటే మన బ్యాట్స్ మెన్స్ పర్ఫామెన్స్ ఆ రేంజ్ లో ఉంది.ఇక మన ప్లేయర్లు కంప్లీట్ గా మొదటి ఇన్నింగ్స్ అయిపోయాక మనం ఈ మ్యాచ్ గెలవలేము అనే ఒకే ఒక ఉద్దేశ్యంతో ఈ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు అంతే తప్ప ఇది గెలవాలనే ఉద్దేశ్యంతో అయితే ఆడలేదు…ఇక బౌలర్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది…
ఇక మన టీమ్ లో నెంబర్ సిక్స్ లేదా సెవన్ పొజిషన్ లో ఆడే సూర్య కుమార్ యాదవ్ ను టీమ్ లోకి ఎందుకు తీసుకుంటున్నారో కెప్టెన్ రోహిత్ కి, కోచ్ ద్రావిడ్ కే తెలియాలి… గల్లీ క్రికెట్ ఆడే వాళ్ళు కూడా ఆయన కంటే బాగా ఆడుతారు…ఇలా ఇండియా మ్యాచ్ ఆడుతున్న సందర్భం లో స్టేడియం మొత్తం సైలెంట్ గా మారడానికి గల కారణాలు ఇవే…
